OTT Movie : మలయాళం సినిమాలంటే ఓటీటీ ప్రియులు పడి చస్తున్నారు. రోజురోజుకూ ఈ సినిమాలను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే మలయాళం మూవీ ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఫ్రెండ్ షిప్ ను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లలకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మనోరమ మాక్స్ (Manorama MAX) లో
ఈ మలయాళం చిల్డ్రన్స్ మూవీ పేరు ‘పల్లొట్టి 90స్ కిడ్స్’ (Pallotty 90’s Kids). 2024 లో విడుదలైన ఈ మూవీకి జితిన్ రాజ్ దర్శకత్వం వహించగా, సజిద్ యాహియా నిర్మించారు. ఇందులో డావిన్చి సంతోష్, నీరజ్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా, అర్జున్ అశోకన్, బాలు వర్గీస్, సైజు కురుప్, నిరంజన అనూప్, దినేష్ ప్రభాకర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. 1990 కాలం నాటి కేరళ గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు పిల్లల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రం కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ గాయకుడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం మనోరమ మాక్స్ (Manorama MAX) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఉన్ని దామోదర్ అనే కార్పొరేట్ ఉద్యోగి, కొచ్చిలో తన డ్రీమ్ బైక్ హార్లీ-డేవిడ్సన్ ను కొని, చిన్నప్పటి తన కలను నెరవేర్చుకుంటాడు. స్వగ్రామానికి అదే బైక్‌పై ప్రయాణిస్తూ, అతని బాల్య స్నేహితుడు కన్నన్ తో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటాడు. అక్కడ నుండి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. కన్నన్, ఉన్ని ఇరుగు పొరుగున ఉండే మంచి స్నేహితులు. కన్నన్ ఉన్ని కంటే కొంచెం పెద్దవాడు. కన్నన్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో, అతని తల్లి కుటుంబాన్ని కష్టపడి పోషిస్తుంది. కన్నన్ తన ట్యాలెంట్ తో పాత వస్తువులను ఉపయోగించి బొమ్మలు తయారు చేసి ఉన్నికి బహుమతిగా ఇస్తాడు. వారిద్దరూ పల్లొట్టి అనే బెల్లంతో చేసిన స్వీట్‌ను ఇష్టపడతారు. ఇది వారి స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ స్వీట్ వల్ల వారి స్నేహం బాగా బలపడుతుంది.
ఉన్ని ఫస్ట్ లవ్, సైన్స్ ఫెస్టివల్, స్పోర్ట్స్ డే, బబుల్ గమ్‌ను మింగడం వంటి ఉల్లాసకరమైన ఘటనలు ఇందులో చాలా ఉంటాయి. ఒక సందర్భంలో కన్నన్ తన కొత్త రబ్బరు చెప్పులను కత్తిరించి, ఉన్ని పుట్టినరోజు కోసం బొమ్మ తయారు చేస్తాడు. ఇది ఉన్నికి, కన్నన్ కి ఉన్న స్నేహం మరింత బలపడేటట్టు చేస్తుంది. ఇలా ఉన్న వీరి జీవితాలు ఒక సంఘటనతో మారిపోతాయి. వీరి స్నేహానికి బ్రేక్ పడుతుంది. చాలా కాలం వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండానే ఉంటారు. ఇప్పుడు ఉన్ని తన డ్రీమ్ బైక్ హార్లీ-డేవిడ్సన్ తో కన్నన్ ను కలవడానికి వెళ్తుంటాడు. చివరికి ఉన్ని తన ఫ్రెండ్ ని కలుస్తాడా ? వాళ్ళ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమిటి ? వీళ్ళు మళ్ళీ మునుపటి లాగే ఉంటారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ముగ్గురు అన్నదమ్ముల చేతిలో నలిగిపోయే అమ్మాయి … సీను సీనుకో ట్విస్ట్ తో మెంటలెక్కించే మూవీ