3 Year Girl Died due to Parents Negligence in Marriage: పిల్లలపై కొంత మంది తల్లిదండ్రులు ప్రదర్శిస్తున్న ప్రవర్తన కారణంగా ప్రాణాలు కోల్పయిన ఘటనలు కూడా వెలుగు చూసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. పిల్లలు ఆడుతున్న సమయంలో ఎక్కడ ఉంటున్నారు, రోడ్లపై వాహనాలు తిరుగుతున్న సమయంలో ఎక్కడ ఆడుకుంటున్నారు వంటి ఆలోచనలు లేకుండా చాలా మంది పిల్లలను కోల్పోయిన ఘటనలు వింటూనే ఉన్నాం. ఇలా ఎన్ని జరుగుతున్నా కూడా పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి జాగ్రత్తలు వహించడం లేదు. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్లతో కలిసి పెళ్లికి వెళ్లి కారులోనే ఓ కూతురిని మర్చిపోయి వెళ్లారు. దీంతో కూతురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లాడు. కారులో వెళ్లిన జంట పెళ్లి వేదిక చేరుకోగానే కారును పార్క్ చేసి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద కూతురుని మాత్రమే కారులో నుండి తీసుకుని వెళ్లారు. చిన్న కూతురిని మాత్రం కారులో వదిలిపెట్టి వెళ్లారు. ఇలా పెళ్లి లోపలికి వెళ్లిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు గంటల తరబడి అక్కడే ఉండిపోయారు. అయితే కొన్ని గంటల తర్వాత ఇద్దరు భార్య భర్తలు కలుసుకున్నారు. ఇంతలో ఇద్దరి దగ్గర చిన్న కూతురు కనిపించకపోవడంతో కంగారు పడిపోయారు. దీంతో పెళ్లి ఫంక్షన్ హాల్ మొత్తం వెతకసాగారు.
Also Read: Hyd woman masks husband’s murder: భర్తను చంపేసి, హార్ట్ ఎటాక్ అంటూ.. అడ్డంగా బుక్కైన వైఫ్
ఈ క్రమంలో పార్కింగ్ వైపు వెళ్లిన ప్రదీప్ కారులో చూడగా చిన్న కూతురు స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. డోరు తీయాలని వెక్కి వెక్కి ఏడ్చి పడిపోయిందని అనుకుని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వెంటనే పరీక్షించిన వైద్యులు ప్రాణం పోయి చాలా సమయం అవుతుందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అయితే మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని వైద్యులు తెలపగా.. తల్లిదండ్రులు నిరాకరించినట్లు సమాచారం.