Disciplined Elephants: సమాజంలో బ్రతికే మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా ట్రైనింగ్ ఇస్తే చాలా క్రమశిక్షణగా ఉంటాయి. ఆ విషయం సర్కస్ లో ఉండే జంతువులను చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. క్రూర మృగాలతో పాటు పెద్ద పెద్ద ఆకారంతో ఉండే జంతువులకు కూడా ట్రైనింగ్ ఇస్తే చెప్పినట్టు నడుచుకుంటాయి. అయితే కొన్ని సార్లు ఈ విషయం అందరికీ తెలిసినా కూడా కొన్ని జంతువులను చూస్తే మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు వీటికి ఇంత క్రమశిక్షణ ఎక్కడిది అనే ఆలోచన వచ్చేస్తుంది. అందులో ముఖ్యంగా కోతులు, ఎలుగుబంటి, గుర్రాలు, ఏనుగులు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు.
మరీ ముఖ్యంగా అయితే ఏనుగులు అంటే చాలా మందికి ఇష్టం. ఏనుగులు ఆకారంలో పెద్దగా ఉన్నా కూడా చాలా మంది వాటిని ఇష్టపడుతుంటారు. ఆకారంలో పెద్దగా, బుడిద రంగులో చూడడానికి ఆకర్షించేలా ఉంటాయి. అయితే ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తే ఎంత బాగా ఉంటాయి అనేది ఓ వీడియోలో చూడొచ్చు. ఏనుగులను తీసుకువెళ్లేందుకు ఓ ట్రక్కులోకి ఎక్కిస్తున్నారు. ఈ తరుణంలో ఏనుగులు ఎక్కే పద్ధతి చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
Also Read: మూగజీవిపై యువకుల పైశాచిక చర్య.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
ఏనుగులు ట్రక్కు ఎక్కే క్రమంలో క్రమశిక్షణ పాటించాయి. ట్రక్కు ముందు ఓ స్టూల్ వేయగా దాని మీద కాలు పెట్టి ట్రక్కులోకి ఎక్కాయి. ఇలా రెండు ఏనుగులు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కాయి. అనంతరం ఆ స్టూల్ ను అవే తీసి ట్రక్కు లోపల పెట్టాయి. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు జంతువులకు ఉండే క్రమశిక్షణ చూసి ప్రశంసిస్తున్నారు. మరి కొంత మంది వన్య ప్రాణులను బంధిస్తున్నరాని మండిపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
?utm_source=ig_web_copy_link">