
Parliament special session news(Latest political news in India):
ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు స్పెషల్ సెషన్ జరగనుంది.
సడెన్‌గా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ఏక్షణమైనా వస్తాయని బీహార్ సీఎం నితీష్ కామెంట్ చేశారు. రీసెంట్‌గా ఇదేమాట వినిపించారు బెంగాల్ సీఎం మమత. తాజాగా, గ్యాస్ ధరలను భారీగా తగ్గించింది మోడీ ప్రభుత్వం. ఇవన్నీ ముందస్తు సిగ్నల్సే అంటున్నారు.
ఓవైపు విపక్షాలు ఇండియా పేరుతో ఇప్పుడిప్పుడే కూటమి కడుతున్నాయి. ఇంకా వారి మధ్య బంధం బలపడలేదు. అది జరిగేలోగా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రతిపక్షాలకు సమయం లేకుండా చేయాలనేది ఎన్డీయే ఎత్తుగడగా తెలుస్తోంది.
ఇప్పటికే కర్నాటకలో బోల్తా కొట్టింది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఉండొచ్చని సర్వేల్లో తేలిందని చెప్తున్నారు. ఆ రిపోర్టులతో బీజేపీ నాయకత్వం ఆందోళన చెందుతోందని.. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు వస్తాయంటూ ప్రతిపక్షాలు నమ్ముతున్నాయి.
అయితే, పూర్తికాలం ప్రభుత్వం కొనసాగిస్తామంటూ బీజేపీ చెబుతోంది. ఇలాంటి టైమ్‌లో స్పెషల్ పార్లమెంట్ సెషన్‌కు ముహూర్తం ఫిక్స్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే, అమృత్ కాల్ నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు.