
Srinidhi College News(Hyderabad latest news):
అది హైదరాబాద్ శివారు శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్. పేరున్న కాలేజే. రాజకీయ అండదండలూ మెండు. తరుచూ వివాదాలతో వార్తల్లో ఉంటుంది. లేటెస్ట్‌గా మరో గొడవ.
కొందరు విద్యార్థులను డిటెండ్ చేసింది కాలేజ్. తమ పిల్లల డిటెన్షన్‌పై ప్రశ్నించేందుకు కాలేజీకి వచ్చారు వారి పేరెంట్స్. అయితే, వారిని లోనికి అనుమతించలేదు. అక్కడే నిరసనకు దిగుదామని ప్రయత్నిస్తే.. శ్రీనిధి కాలేజ్ సెక్యూరిటీ మూకలు వారిపై విరుచుకుపడ్డాయి.
తమ కాలేజీలోనే చదువుతున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులనే కనీస రెస్పెక్ట్ కూడా లేకుండా.. రౌడీల్లా దాడి చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న సెక్యూరిటీ టీమ్.. పాపం ఆ పేరెంట్స్‌ను విచక్షణారహితంగా చితకబాదారు.
ఆ వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డిటెన్షన్‌పై మాట్లాడటానికి వస్తే.. ఇలా కొట్టి తరిమేయడమేంటని మండిపడుతున్నారు. కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి.