BigTV English

Parliament: పార్లమెంట్ సమరానికి అంతా సై.. ఆ అంశాలపై పోరు తప్పదా?

Parliament: పార్లమెంట్ సమరానికి అంతా సై.. ఆ అంశాలపై పోరు తప్పదా?
Parliament monsoon session 2023

Parliament monsoon session 2023(News paper today): గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 31 బిల్లులు ప్రవేశపెట్టంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం ఈ విషాయాన్ని ప్రకటించింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అన్ని పార్టీల నాయకులను కోరింది.


అంతకు ముందు అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, కామన్ సివిల్ కోడ్, మణిపూర్ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలంటూ పలు పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్‌తో పాటు.. బీజేడీ తదితర పార్టీలు కూడా మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని సూచించాయి.

ఇక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు గవర్నర్ల వ్యవస్థపై చర్చించాలని కోరినట్లు బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు తెలిపారు. రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదలపై వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.


మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని తమ పార్టీ కూడా సూచించినట్లు వైఎస్ఆర్సీపీ లోక్‌సభాపక్‌ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రతీ సమావేశాల్లోలాగే ఈసారి కూడా సమయం వృధా కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ సహా 44 పార్టీల ప్రతినిధులు హాజరైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా మణిపూర్ వ్యవహారంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. స్పీకర్ అనుమతి మేరకు సభలో చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×