BigTV English

Rumours: ట్రైన్‌లో మంటలు అంటూ ప్రచారం.. బ్రిడ్జీపై నుంచి దూకేసిన ప్రయాణికులు

Rumours: ట్రైన్‌లో మంటలు అంటూ ప్రచారం.. బ్రిడ్జీపై నుంచి దూకేసిన ప్రయాణికులు

Passengers: నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని అంటారు. నిజం అందరికీ చేరే లోపు ఆ అసత్య ప్రచారం చేయాల్సిన నష్టం చేసి పోతుంది. ట్రైన్‌లో నిప్పు అంటుకున్నదనే ఓ అవాస్తవ ప్రచారం బోగీల్లో వ్యాపించింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు ప్రయాణికులు బ్రిడ్జీ పై నుంచి దూకేశారు. తీరా చూస్తే.. ఆ ట్రైన్‌లో మంటలు లేనేలేవు. ఇలా బ్రిడ్జీపై నుంచి దూకినవారిలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


హౌరా- అమృత్ సర్ మెయిల్‌ యూపీలోని బిల్‌పూర్ స్టేషన్ సమీపంలో ఉన్నప్పుడు జనరల్ కోచ్‌లో ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ డివిజన్‌లోని బిల్‌పూర్ స్టేషన్ సమీపానికి చేరుకున్నప్పుడు ట్రైన్‌లో గందరగోళం చెలరేగింది. ట్రైన్‌లో మంటలు వ్యాపిస్తున్నాయనే పుకారు పాకింది. ఈ గందరగోళంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. ట్రైన్ ఆగడానికి స్లో అవుతున్నది. కానీ, ఆ ట్రైన్ ఆగకముందే మంటల భయంతో పలువురు ప్రయాణికులు కదులుతున్న ట్రైన్‌లో నుంచి కిందికి దూకేశారు. ఇలా దూకిన వారిలో ఇద్దరు మహిళలు సహా నలుగురు గాయపడినట్టు జీఆర్పీ స్టేషన్ ఇంచార్జీ రేహాన్ ఖాన్ ధ్రువీకరించారు. వారిని వెంటనే షాజహాన్ పూర్ మెడికల్ కాలేజీకి చికిత్స నిమిత్తం తరలించారు.

Also Read: Minister Kollu Ravindra: శుభవార్త.. ఏపీలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు..?


ట్రైన్‌లోని ఓ ఆకతాయి ప్రయాణికుడు లేదా.. అనుకోకుండా ఓ ప్రయాణికుడు అగ్నిమాపక యంత్రాన్ని(ఫైర్ ఎక్స్‌టింగ్విషర్) స్విచ్చాన్ చేశారు. దీంతో ఎక్కడో మంటలు అంటుకున్నాయనే అనుమానాలు చాలా మందికి వచ్చింది. దీంతోనే పుకార్లు రావడంతో చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రైన్ బ్రిడ్జీపై నుంచి వెళ్లుతుండగానైనా వారు కిందికి దూకేశారు. ఈ ఘటనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×