BigTV English

Prasanth Kishore: బీహార్ సీఎం కావాలంటే టెన్త్ పాసవ్వాలట..పీకే చెబుతున్న మాట

Prasanth Kishore: బీహార్ సీఎం కావాలంటే టెన్త్ పాసవ్వాలట..పీకే చెబుతున్న మాట

People of Bihar don’t want 10th fail leadership: Prashant Kishor to youngsters: ప్రశాంత్ కిషోర్..ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు. భారత రాజకీయాలను ఔపాసన పట్టిన రాజర్షి అంటారు. ఏ పార్టీకి జనంలో ఎంత ఆదరణ ఉంది..అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి వంటి విషయాలను కూలంకుషంగా స్టడీ చేసి బెస్ట్ పొలిటికల్ వ్యూహకర్తగా మంచి పేరు సంపాదించుకున్నారు. జాతీయ పార్టీ నేతలనుంచి ప్రాంతీయ పార్టీ నేతల దాకా ప్రశాంత్ కిషోర్ ను కోరుకుంటున్నారంటే ఆయనకున్న డిమాండ్ ఏమిటో అర్థం అవుతుంది. సింపుల్ గా అందరూ పీకే అని పిలుచుకుంటారు. ఈయన కున్న బలం, బలగం ఐప్యాక్ టీమ్. ఈ టీమ్ రంగంలో దిగితే చాలు పొలిటికల్ పార్టీలకు టెన్షన్. అప్పట్లో 2014 ఎన్నికలలో మోదీ తొలిసారి ప్రధాని కావడానికి పీకే టీమ్ సాయం కోరడం..ఆ ఎన్నికలలో మోదీ గెలవడం జరిగిపోయాయి. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ కు ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చి గెలుపు వ్యూహాలను రచించి ఆయనను సీఎం అయ్యేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువ శాతం విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఏవో కొద్ది ఫెయిల్యూర్స్ తప్ప.


సొంత పార్టీ ఆలోచన

వేరే ఇతర పార్టీలకు వ్యూహాలు రచించడమెందుకు..తానే సొంతంగా పొలిటికల్ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అందుకే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తన పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్. జన్ సురాజ్ పార్టీ ఆదర్శ భావాలు కలిగిన యువకుల కోసం తాను పార్టీ పెట్టానని అంటున్నారు పీకే. రాజకీయ వ్యవస్థలోనే సరికొత్త ఒరవడి క్రియేట్ చేస్తామంటున్నారు పీకే. నేటి యువకులు రాజకీయాల పట్ల శ్రద్ధ వహించడం లేదని..అదేదో అపరాధం చేసిన భావనలో ఉన్నారని..యువత తప్పనిసరిగా రాజకీయాలలోకి రావాలని..అందుకోసం తమ పార్టీ జన్ సురాజ్ సంసిద్ధంగా ఉందంటున్నారు పీకే. అన్ని పార్టీల మాదిరిగా ఉండదు తన పార్టీ అంటున్నారు పీకే. కనీస విద్యార్హతలు ఉన్న విద్యావంతులకే తన పార్టీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని అంటున్నారు.


డబ్బు ఖర్చులేని రాజకీయాలు

బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ తమ రాష్ట్రానికి పదవ తరగతి ఫెయిల్ అయిన నాయకత్వం అవసరమే లేదంటున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ అదే జరుగుతూ వస్తోందని..ఇకపై అలా జరగనియ్యనని పీకే అంటున్నారు. చాలా మంది రాజకీయాలలోకి రావాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని అనుకుంటారు. అవేమి అవసరం లేదని అంటున్నారు పీకే. తనవద్దకు అలాంటి వారు వస్తే పైసా ఖర్చుపెట్టకుండా ఎన్నికలలో ఎలా గెలవాలో మెలకువలు నేర్పిస్తానని పీకే అంటున్నారు. చూడబోతే జన్ సురాజ్ పార్టీ బీహార్ రాజకీయాలలో పెను సంచలన మార్పులకు శ్రీకారం చుట్టేలా ఉంది అని జనం అంటున్నారు. ఇతర పార్టీలకే తన పదునైన వ్యూహాలను రచించి వారి గెలుపునకు ప్రత్యక్ష, పరోక్షసాయం అందిస్తున్న పీకే తన సొంత పార్టీ విషయానికి వస్తే అంతకు మించి కష్టపడి గట్టి పునాదులే వేసేలా ఉన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×