Shobha Shetty:శోభా శెట్టి (Shobha Shetty) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘కార్తీకదీపం’ సీరియల్ లో మోనిత పాత్రలో విలన్ గా నటించి, తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఈ సీరియల్ తో వచ్చిన ఇమేజ్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టే అవకాశం అందుకుంది. అక్కడ కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె తన ఆటతో మాటలతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. టైటిల్ విజేత అవుతుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది.
ఇకపోతే కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డి (Yashwanth Reddy) తో ప్రేమలో పడ్డ ఈమె.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ప్రియుడితో కలిసి కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఆ కొత్త ఇంట్లో పెళ్లి చేసుకోకుండానే వ్రతాలు, పూజలు మొదలుపెట్టిన ఈమె అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఇక నిశ్చితార్థం జరిగి ఏడాది అయినా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.
ALSO READ:Deepika Padukone: నన్నే టార్గెట్ చేస్తున్నారు… కల్కి కాంట్రవర్సీపై దీపిక రియాక్షన్!
ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో ఏర్పడిన నెగిటివిటీ కారణంగా కార్తీకదీపం సీరియల్ 2 లో కూడా అవకాశాన్ని కోల్పోయింది. ప్రస్తుతం నటన రంగానికి దూరంగా ఉన్న ఈమె బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇటీవల అక్టోబర్ 5వ తేదీన “శోభాశెట్టి డిజైనర్ స్టూడియో” ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. ఇకపోతే ఈ రంగంలో ఆమె సక్సెస్ కావాలని కోరుకున్నారు కూడా.. ఇకపోతే సడన్గా ఈ కొత్త బిజినెస్ మొదలు పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అని అభిమానులు ఆరా తీయగా.. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ప్రమోషనల్ వీడియో చేసిన శోభా శెట్టి అనుకోకుండా తన వేలికి ధరించిన ఉంగరాన్ని చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది. విషయంలోకి వెళ్తే.. ఆమె తన కుడి చేతి చూపుడు వేలుకి తాబేలు పొదిగిన ఉంగరాన్ని ధరించింది. ఈ ప్రమోషనల్ వీడియోని ఈమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఉంగరం చూసిన అభిమానులు, నెటిజన్లు ఓహో కొత్త వ్యాపారం మొదలుపెట్టడం వెనుక అసలు కథ ఇదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శోభా శెట్టి ధరించిన తాబేలు ఉంగరం వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? దానిని ఎందుకు ధరిస్తారు? అనే విషయానికి వస్తే.. జ్యోతిష్య, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని, వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. తాబేలును విష్ణు అవతారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ధరించడం శుభప్రదం. ముఖ్యంగా వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల మరిన్ని శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
సంపదకు చిహ్నంగా భావించే ఈ తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని , ధనానికి లోటు ఉండదని, కెరియర్లో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వ్యాపారంలో సక్సెస్ కావాలని ఇలా ఈ ఉంగరాన్ని ధరించినట్లు సమాచారం. ప్రస్తుతం శోభా శెట్టి ధరించిన ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==