Indian Army : ఈ విషాదగాధ చదవాల్సిందే. ఆ ఎయిర్‌ఫోర్స్ పైలట్ చేసిన పని తెలుసుకోవాల్సిందే. ఆర్మీ సోల్జర్స్ డ్యూటీ కోసం ఎలా ప్రాణం పెడతారో.. పక్కవారి ప్రాణం కోసం ఎలా తన ప్రాణాలను త్యాగం చేస్తారో తెలియజేసే ఇన్సిడెంట్. వింటే గూస్‌బంప్స్ వస్తాయి. చదివితే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అంతటి ఎమోషనల్ ఉదంతం ఇది.
10 రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్.. అంతలోనే…
10 రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ జరిగింది. వారికొన్ని వారాల్లో మ్యారేజ్. అంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు. అతనూ డ్రీమ్స్‌లో మునిగిపోయాడు. ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ పైలట్ అతను. పేరు సిద్ధార్థ్ యాదవ్. చిన్ననాటి నుంచే బ్రైట్ స్టూడెంట్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDAలో చదివాడు. 2017లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. అత్యాధునిక జాగ్వార్ ఫైటర్ జెట్‌కు పైలట్‌గా చేస్తున్నాడు.
గాల్లో ప్రాణాలు.. క్షణక్షణం ఉత్కంఠ
ఏప్రిల్ 2న ఊహించని ఘటన జరిగింది. ఎప్పటిలానే తానూ, మరో పైలట్.. ఇద్దరూ కలిసి యుద్ధవిమానంతో గాల్లో చక్కర్లు కొడుతున్నారు. అంతలోనే ఊహించని ప్రమాదం. ఫైటర్ జెట్‌లో ఏదో ప్రాబ్లమ్. విమానం అదుపు తప్పి పోయింది. చూస్తుండగానే అత్యంత వేగంగా కిందకు పడిపోతోంది. సమయం లేదు. ఆ ఇద్దరు పైలట్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఫైటర్‌జెట్ అదుపులోకి రావట్లేదు. ఇక పరిస్థితి తమ చేజారిపోయిందని ఫిక్స్ అయిపోయారు. యుద్ధవిమానం నేల కూలడం ఖాయమని తేలిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒక్కటే మార్గం. విమానం కూలినా పైలట్స్ ఇద్దరూ బయటపడాలి. అయితే, ముందు ఎవరు ఎగ్జిట్ కావాలి? సిద్ధార్థ్ యాదవ్ ఒక్కక్షణం కూడా ఆలోచించలేదు. తనకు 10 రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ అయిందని.. త్వరలోనే పెళ్లి అనే విషయాన్ని ఆ సమయంలో గుర్తు చేసుకోలేదు. ఓ సోల్జర్ గానే థింక్ చేశాడు. మొదటగా తన సహచరుడిని బయటపడేయాలని భావించాడు. ముందు అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత తానూ ఆ ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. యుద్దవిమానం కుప్పకూలిపోయింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్దార్థ్ యాదవ్ విమాన ప్రమాదంలో ప్రాణాలు వదిలాడు. సహచరుడి కోసం తన ప్రాణాలను విడిచాడు.
సిద్ధార్థ్ యాదవ్.. ది రియల్ సోల్జర్
ప్రమాద సమయంలో సిద్ధార్థ్ యాదవ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటోంది. ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసిన క్లిష్టపరిస్థితుల్లోనూ ఆయన తన గురించి ఆలోచించకుండా తోటి పైలట్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. మరో పైలట్‌ను ఫైటర్ జెట్ నుంచి బయటపడేసి తాను మాత్రం ప్రాణత్యాగం చేశారు. అంతేకాదు.. పౌరులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించి నివాస ప్రాంతాలకు దూరంగా విమానాన్ని తీసుకెళ్లారు.
Also Read : అఘోరీ, శ్రీవర్షిణి ప్రేమతో ఖతర్నాక్ ట్విస్ట్
ఆర్మీ రక్తం.. ఆర్మీ సాహసం..
హరియాణాలోని మజ్రా భల్ఖి గ్రామానికి చెందిన సిద్ధార్థ్… సైనిక కుటుంబం నుంచే వచ్చాడు. ఆయన కుటుంబంలో నాలుగు తరాల వారు దేశ రక్షణ కోసం పనిచేశారు. ఆయన తండ్రి సుశీల్ కుమార్ ఐఏఎఫ్‌లో విధులు నిర్వహించి.. పదవీ విరమణ చేయగా, తాత రఘుబీర్ సింగ్, ముత్తాత భారత సైన్యంలో పని చేశారు. కొడుకు మరణంపై పైలట్ తండ్రి సుశీల్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. తోటి పైలట్ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో.. సిద్ధార్థ్ యాదవ్ తన ప్రాణాలను త్యాగం చేసినందుకు తమ కుటుంబం గర్వపడుతోందన్నారు. ఆర్మీ వాళ్లు అంటే అలా ఉంటారు మరి.