E-Paper
Advertisement

ట్రైనింగ్ విమానానికి తప్పిన ముప్పు, పంట పొలాల్లో ల్యాండింగ్, కర్ణాటకలో ఘటన

ట్రైనింగ్ విమానానికి తప్పిన ముప్పు, పంట పొలాల్లో ల్యాండింగ్, కర్ణాటకలో ఘటన
Advertisement

Kalaburagi: ఈ మధ్యకాలంలో విమానాల ఘటనలు ప్రయాణికులకు వణికిస్తున్నాయి. చీటికి మాటికి ఎమర్జెన్సీ కోడ్ యాక్టివేట్ కావడంతో, పలు విమానాలు ప్రమాదాలు చోటు చేసుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సాంకేతిక లోపం కారణంగా ట్రైనింగ్ విమానం ఒకటి కర్ణాటకలోని పంట పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది.

ట్రైనింగ్ విమానానికి తప్పిన ముప్పు

సాంకేతిక లోపం కారణంగా మంగళవారం కర్ణాటక కలబురిగి సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పైలట్ శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. విమానంలో ఉన్న పైలట్, శిక్షణ పొందుతున్న కో-పైలట్ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

కర్ణాటకలోని పంట పొలాల్లో సేఫ్‌గా ల్యాండింగ్, దర్యాప్తు మొదలు

Advertisement

పోలీసుల కథనం మేరకు.. రెండు సీట్ల విమానం ఓ ప్రైవేట్ శిక్షణా అకాడమీకి చెందినది. సాధారణ శిక్షణా విమానంలో ఉండగా అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. అందులోని సిబ్బంది వెంటనే స్పందించి విమానాన్ని ఓ వ్యవసాయ క్షేత్రంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీని గురించి తెలియగానే పోలీసు సిబ్బంది, కలబురిగి విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాంకేతిక సమస్యకు గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విమానాశ్రయ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

ALSO READ: ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్ల మీదకు ఢిల్లీ ప్రజలు, ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం

 

 

 

Related News

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్ల మీదకు ఢిల్లీ ప్రజలు, ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

Big Stories

Advertisement
×