E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం తెలుస్తుందా..? సూరజ్ అడ్డుపడతాడా..?            

Karthika Deepam 2 Serial Today Episode October 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం తెలుస్తుందా..? సూరజ్ అడ్డుపడతాడా..?            
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  కార్తీక్‌, దీప ఇద్దరూ కలిసి శివనారాయణ టిఫిన్‌ సెంటర్‌ దగ్గరకు వెళ్తారు. అక్కడ చాలా మంది టిఫిన్‌ చేయడం చూసి ఆశ్చర్యపోతారు. శివనారాయణ ఒక్కడే పని చేస్తుండటం చూసి తాము హెల్ప్‌ చేస్తామని అడుగుతారు. అందుకు శివనారాయణ ఒప్పుకోడు. అయితే టిఫిన్‌ ఇవ్వమని అడిగి తిని తర్వాత డబ్బులు లేవని చెప్తారు. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు వెళ్లిపోమని శివనారాయణ చెబితే.. ఊరికే తిని వెళ్లిపోయే రకం తాము కాదని బిల్లు కట్టకపోతే పని చేయిస్తారు కదా అలా తాము ఇక్కడ పని చేసి బిల్లు రుణం తీర్చుకుంటామని కార్తీక్‌, దీప ఇద్దరు కలిసి టిఫిన్ సెంటర్‌ దగ్గర శివనారాయణకు తోడుగా పని  చేస్తారు.

సుమిత్రకు జ్యోత్స్న తమ కంపెనీలో పీఏగా జాయిన్‌ అయిందని చెప్పడానికి మాలిని వెళ్తుంటే దక్షిణమూర్తి ఆపేస్తాడు. ఇప్పుడు ఆ విషయం సుమిత్రకు చెప్పాల్సిన అవసరం ఏముందని అడుగుతాడు. అందుకు మాలిని నేను మీ మాటను గౌరవిస్తాను. అందుకే మీకు ఆపీసులో ఎదురుచెప్పలేదు. దయచేసి మీరు నన్ను ఆపోద్దు నేను ఇప్పుడే వెళ్లి సుమిత్రకు చెప్పాల్సిందే అంటే.. అదేం వద్దని జ్యోత్స్న మన ఆఫీసులోనే ఉంటుంది అని దక్షిణమూర్తి అంటే ఇప్పుడు నేను తీసేయడం లేదని మాలిని అంటే నువ్వు వెళ్లి చెబితే ఇప్పుడు జ్యోత్స్నను వాళ్లే ఆఫీసుకు రానివ్వరు అంటాడు. జ్యోత్స్న గురించి ఎమోషనల్‌ అవుతాడు. మాలిని మాత్రం ఎలాగైనా సుమిత్ర వాళ్లకు నిజం చెప్పాలని మొండిగా వాదిస్తుంది. అందుకు దక్షిణమూర్తి కోపంగా నా నిర్ణయాన్ని మీరు గౌరవించకపోతే మీరే ఉంటారు. అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. నువ్వేం మాట్లాడవేంట్రా అని మాలిని సూరజ్‌ను అడిగితే.. తాతయ్య చెప్పింది నిజమే కదా అమ్మా అంటూ వెళ్లిపోతాడు సూరజ్‌.

Advertisement

కార్తీక్‌, దీపలు ఇద్దరు ఇంటికి వెళ్లగానే.. అందరూ జ్యోత్స్న కోసం ఎదురుచూస్తుంటే.. మా కన్నా ముందే వచ్చిందే అని దీప అనగానే.. అందరూ షాక్‌ అవుతారు. మీకన్నా ముందే అంటే మీరందరూ ఒకేచోట పని చేస్తున్నారా..? లేకపోతే జ్యోత్స్న మీ ఆఫీసుకు వచ్చిందా..? అంటే అందరూ ప్రశ్నిస్తారు. కార్తీక్‌, దీపలు డైలమాలో పడిపోతారు. అందరూ జ్యోత్స్న గురించి అడిగితే కార్తీక్‌ ఏదో చెప్పి రూంలోకి వెళ్లిపోతాడు.

తర్వాత మాలిని కాంచన ఫోన్‌కు కాల్‌ చేస్తుంది. ఫోన్‌ డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టి కాంచన బయట ఉంటుంది. అప్పుడే ఫోన్‌ రింగ్‌ విని సుమిత్ర వచ్చి కాల్‌ లిఫ్ట్ చేస్తుంది. సుమిత్రకు మాలిని జ్యోత్స్న గురించి తమ ఆఫీసులో పని చేస్తున్న విషయం గురించి చెప్పబోతుంటే.. సూరజ్‌ వచ్చి కాల్‌ కట్‌ చేస్తాడు. దీంతో సూరజ్‌, మాలిని మధ్య గొడవ జరుగుతుంది. తాత చెప్పొద్దన్నా నువ్వెందుకు నిజం చెప్తున్నావు..? అంటూ నిలదీస్తాడు. నువ్వు జ్యోత్స్నను అడ్డుకోవాలి అనుకున్నావు తనొచ్చి మన ముందే నిలబడింది. జ్యోత్స్న ఉంటుందా..? పోతుందా తన ఇష్టం. వదిలేయ్‌ అమ్మా అంటూ చెప్పి వెళ్లిపోతుంటే.. అయితే నువ్వు నీ తల్లిని నమ్మడం లేదా..? చూస్తుంటే.. నీ తండ్రి చావు విషయంలో కూడా నాదే తప్పు అనేలా ఉన్నావు అంటూ తిడుతుంది మాలిని. సూరజ్‌ తనకు తెలియని వాటి గురించి చూడని వాటి గురించి మాట్లాడను.. జ్యోత్స్నను ఇంకా రెచ్చగొట్టి ఇంటి దాకా వచ్చేలా చేయకు అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

ఇంట్లో కార్తీక్‌, దీపలను పిలిచి మాలిని, కాంచన ఫోన్‌కు కాల్‌ చేసి ఏదో చెప్పబోయింది అంటూ సుమిత్ర చెప్పగానే.. కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. ఏం చెప్పబోయింది అంటూ అడిగితే ఏదో చెప్పబోయి వెంటనే కాల్‌ కట్‌ చేసింది. కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదని సుమిత్ర చెప్తూ.. మాలిని ఫోన్‌ చేసి జ్యోత్స్న గురించి ఏదో చెప్పబోయింది. ఇంతవరకు జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదు అంటూ కంగారుపడుతుంది. అప్పుడే జ్యోత్స్న, కార్తీక్‌కు ఫోన్‌ చేస్తుంది. సుమిత్ర మాట్లాడుతుంది. జ్యోత్స్న తను వేరే పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చిందని రేపు రాత్రికి ఇంటికి వస్తానని చెప్తుంది. అందరూ కూల్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Ninnu kori Serial Today Episode October 7th ‘నిన్ను కోరి’ సీరియల్‌: మరోసారి సామ్రాట్ ను చంపేస్తానన్న దాక్షాయణి   

Wedensday Tv Movies : బుధవారం సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ 4 మస్ట్ వాచ్..

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

Big Stories

Advertisement
×