Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ టాప్ పొజిషన్ లో ఉంటున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సినిమాలకు మించిన డిమాండ్ వీటికి ఉండటంతో ఎక్కువమంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా అలరిస్తున్నాయి. కొన్ని సీరియల్స్ కథ డిఫరెంట్ గా ఉండడంతో ఎక్కువమంది ఆ సీరియల్స్ ని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత వారం సీరియల్స్ టీఆర్పీ విషయానికొస్తే.. గుండెనిండా గుడిగంటలు సీరియల్ టాప్ లోకి వచ్చింది. ఈ వారం ఏ సీరియల్ టాప్ లోకి వస్తుందో చూడాలి..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో కొత్త సీరియల్స్ కి కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతినెల కొత్త కొత్త సీరియల్స్ ప్రారంభమవుతూ ఉంటాయి. గత కొన్ని నెలలు లేడీస్ సీరియల్స్ ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. వీటితో పాటుగా గత సీరియల్ కూడా మంచి రేటింగ్ నమోదు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఈ ఛానల్ కి సంబందించిన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ను నమోదు చేసుకోవడంతో సీరియల్ లవర్స్ ఎక్కువగా ఎక్కడ వచ్చే సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్ లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు టాప్ రేటింగ్ దూసుకుపోయిన ఈ సీరియల్ ఇప్పుడు గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ టిఆర్పి రేటింగ్ కూడా దారుణంగా పడిపోయింది. అలాగే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా శుభం కార్డు వేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సిరియల్ త్వరలోనే గుడ్ బై చెప్పబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ సీరియల్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.63 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.30 ఉంది. పొదరిల్లు 11.75, ఇంటింటి రామాయణం 11.54, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.47, నువ్వులేక నేను లేను10.60, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.07.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత ఏ మాత్రం నమోదు అవుతుందో చూడాలి..
Also Read : బుధవారం సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ 4 మస్ట్ వాచ్..