Big Stories

PM Modi on BJP Manifesto: పేదల జీవితాలను మార్చడమే మోదీ ఇస్తున్న గ్యారంటీ..!

PM Modi Explained about BJP Manifesto: పేదల జీవితాలను మార్చడమే మోదీ ఇస్తున్న గ్యారంటీ అని అన్నారు ప్రధాని మోదీ. ఆదివారం వికసిత్ భారత్ పేరుతో బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రాని విడుదల చేసిన ప్రధాని మోదీ ఉత్తమ మేనిఫెస్టో చేశారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందించారు. గత పదేళ్లో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ సంకల్ప పత్రం యువత ఆకాంక్షలను ప్రతిబింభిస్తోందని చెప్పారు. యువత, మహిళ, పేదలపై ఎక్కువగా ఫోకస్ చేశామని పేర్కొన్నారు.

- Advertisement -

ఇవ్వాళ అత్యంత శుభదినమని.. దేశమంతా అంబేద్కర్ జయంతి జరుపుకుంటుందన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాలు నేడు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుందని తెలిపారు. అన్ని కలిసొచ్చిన ఈ పవిత్ర రోజున బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం శుభసూచకమన్నారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తామని స్పష్టం చేశారు. ఇక 70 ఏళ్ల పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు చేస్తామన్నారు. ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా అందరికీ మేలు చేయడమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇక సూర్యఘర్ పథకం ద్వారా పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు సౌభాగ్య యోజన పథకం కింద పేదలకు సబ్సిడీ కింద తక్కువ రేటుకే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని.. ఇక ముందు పైప్ లైన్ ద్వారా తక్కువ ధరకే గ్యాస్ అందిస్తామన్నారు. పేదల కోసం మరో 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు.

Also Read: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ప్రధాన అంశాలివి

వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ముద్ర లోన్ పథకాన్ని రూ. 20 లక్షలకు పెంచుతామన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం కృషి చేస్తామని తెలిపారు. భారత్‌ను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా మారుస్తామని పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన కొనసాగిస్తామన్నారు. చిరువ్యాపారులకు మరిన్ని రుణాలిస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

భారత దేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమృత్ భారత్, వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేశారు. దక్షిణ, మధ్య భారతంలో కూడా బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామన్నారు. 5G ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని  6G రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు ప్రధాని మోదీ.

తాము అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలు అమల్లోకి తెస్తామన్నారు ప్రధాని మోదీ. యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొస్తామని.. కరెప్షన్‌పై ఉక్కు పాదం మోపుతామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News