BigTV English

PM Modi : చిన్నతనం గుర్తు చేసుకున్న మోదీ .. బహిరంగ సభలో భావోద్వేగం..

PM Modi : ప్రధాని నరేంద్రమోదీ మహరాష్ట్ర షోలాపూర్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ సభలో కన్నీటి పర్యంతమయ్యారు.

PM Modi :  చిన్నతనం గుర్తు చేసుకున్న మోదీ ..  బహిరంగ సభలో భావోద్వేగం..

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర షోలాపూర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ సభలో కన్నీటి పర్యంతమయ్యారు.


పీఎం ఆవాస్‌ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీని తన చేతులు మీదగా ప్రారంభించడం గర్వంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను 2014లో హామీ ఇచ్చానని గుర్తు చేశారు. హామీ నెరవేర్చడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఇళ్లను చూడగానే తన బాల్యం గుర్తొచ్చిందని తెలిపారు. చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించుకున్నాని పేర్కొన్నారు. భావోద్వేగంతో గద్గద స్వరంతో కార్యక్రమంలో ప్రసంగించారు. కన్నీళ్లను దిగమింగుకుని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

కార్యక్రమంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని జనవరి 22న దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో రామజ్యోతి వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీరాముడి నిజాయితీని తన ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని పేర్కొన్నారు. సమాజంలో కట్టుబాట్లను, విలువలను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడని. అదే బాటలో మా ప్రభుత్వం పయనిస్తోందన్నారు.


ప్రజల కలలు నేరవేర్చడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలకు చేరుకోలేదన్నారు. గరీబీ హఠావో పథకం కేవలం నినాదంగా మిగిలిపోయిందని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×