Airtel vs Vi Annual Plan: టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారుల కోసం ఒకే ధరకు రెండు అద్భుతమైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అదే రూ. 3,999 రీచార్జ్ ప్లాన్. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఈ ఖరీదైన ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీని యూజర్లకు అందిస్తుంది. అయితే ఈ వార్షిక ప్లాన్లు ఒకే ధరను కలిగి ఉన్నప్పటికీ బెనిఫిట్స్ పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్లకు సంబంధించిన వివరాలు, దేనివల్ల యూజర్లకు ఎక్కువ బెనిఫిట్ అన్నది ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్‌టెల్ ఈ రూ. 3,999 ప్లాన్‌తో రోజువారీ డేటాతో పాటు బోనస్ డేటాను కూడా ఆఫర్ చేస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. రోజుకు 2.5GB డేటాతో పాటు అదనంగా 150GB బల్క్ డేటా బోనస్‌గా లభిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ కూడా ఇందులో వర్తిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కింద సుమారు రూ. 4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) సబ్‌స్క్రిప్షన్ 12 నెలల పాటు ఉచితంగా పొందొచ్చు. వీటితో పాటు ఉచిత హలో ట్యూన్స్ సౌకర్యం కూడా ఉంది.
ఈ వొడాఫోన్ ఐడియా ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇందులో కూడా యూజర్లకు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ లో ప్రతీరోజూ 2GB డేటా మాత్రమే యూజర్ కు లభిస్తుంది. ఇది ఎయిర్ టెల్ ప్లాన్ తో పోలిస్తే 500MB తక్కువ. కానీ ఎయిర్ టెల్ ఇవ్వని అడిషన్ డేటా బెనిఫిట్స్ ను వీఐ ఆఫర్ చేస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. అలాగే మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్’, ప్రతినెలా 2GB వరకు ఉచితంగా పొందే ‘బ్యాకప్ డేటా’ సౌకర్యం వీఐ ప్లాన్ లో లభిస్తాయి. అంతేకాకుండా 5 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 1GB ఇంటర్నేషనల్ డటా, 50 నిమిషాల విదేశీ టాక్ టైమ్ ఈ ప్లాన్ లో పొందొచ్చు. అదే విధంగా డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది పాటు ఫ్రీగా లభించనుంది.
Also Read: BSNL సంచలన ఆఫర్.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే!
పైన పేర్కొన్న ఎయిర్ టెల్, వీఐ ప్లాన్స్ అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నప్పటికీ.. ఇతర ప్రయోజనాల్లో మాత్రం స్పష్టంగా వ్యత్యాసం కనిపిస్తోంది. మీకు ఎక్కువ డేటా (4G డేటా), డిజైనింగ్ పనికి ఉపయోగపడే అడోబ్ ఎక్స్‌ప్రెస్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే భారతీ ఎయిర్‌టెల్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఫ్రీ ఓటీటీ (అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్), రాత్రి వేళల్లో అపరిమిత డేటా, డేటా రోల్‌ఓవర్, విదేశీ ప్రయాణాల కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ బెనిఫిట్స్ కోరుకునే వారికి వొడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: మోటో, ఒప్పో, ఐఫోన్ లవర్స్‌కి పండగే పండగ.. ఏ ఫోన్ ఎంత తక్కువకొస్తుందో తెలిస్తే షాకే!