Rangareddy: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ కన్నతల్లి తన ముగ్గురు చిన్నారులను నీటి సంపులో తోసేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముగ్గురు చిన్నారుల బలి
గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఇంట్లో కొంతకాలంగా నెలకొన్న కుటుంబ కలహాల కారణంగా సదరు మహిళ తీవ్ర ఆవేదనతో ఉంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఆమె, ఆడుకుంటున్న తన ముగ్గురు పిల్లలను ఇంటి ఆవరణలోని నీటి పంపులో తోసేసింది. అనంతరం తాను కూడా అందులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
తల్లికి గాయాలు..
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. నీటి సంపులో ఊపిరాడక అప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పసికందుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ముగ్గురు పిల్లలను సంపులోకి తోసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను నీటి సంపులో తోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోగా, తల్లికి స్వల్ప గాయాలు అయ్యాయి. #rangareddy… pic.twitter.com/VW4KFCDuJ3
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2026
Also Read: గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు.. తెలంగాణ మోడల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు