Big Stories

PM Modi Message on Elections 2024: తొలిదశ లోక్ సభ ఎన్నికలు.. ఓటర్లకు ప్రధాని మోదీ సందేశం!

PM Modi Message to Voters on First Phase Elections 2024 India: దేశంలో నేడు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలతో పాటు.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకుని ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. తొలిదశ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఓటర్లనుద్దేశించి సందేశాన్ని పంపారు.

- Advertisement -

ప్రజలు, ముఖ్యంగా యువ ఓటర్లు, తొలిసారిగా ఓటు హక్కు పొందినవారు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన పలు భాషల్లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రతీ ఓటు, ప్రతీ గొంతు ఎన్నికల్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: తొలివిడత లోక్ సభ పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన RSS చీఫ్ మోహన్ భగవత్

“2024 లోక్‌సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున, ఈ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. యువకులు, మొదటిసారి ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను. అన్నింటికంటే.. ప్రతి ఓటు లెక్కించబడుతుంది.” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News