Big Stories

Nagari Liquor Dump: నగరిలో భారీగా మద్యం డంప్.. పోలీసులపై మంత్రి ఒత్తిడి!

Nagari Police found Liquor Dump Midnight at a Collage Surrounding: ఏపీలో నామినేషన్ల వేళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ నేతల ఆగడాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం లో భారీగా మద్యం డంప్ వెలుగుచూసింది. అర్థరాత్రి పూత్తూరులో మద్యం డంప్ వ్యవహారం వెలుగు చూసింది. దాదాపు 250 కేసులో కూడిన మద్యం కేసులను ప్రైవేటు కళాశాలలో ఉంచారు వైసీపీ నేతలు.

- Advertisement -

శుక్రవారం నగరిలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయనున్నారు. ఈ సమయంలో మద్యం డంప్ వ్యవహారంపై వెలుగుచూసింది. రాత్రి మద్యం తరలిస్తుండగా పుత్తూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ సమీప బంధువుతోపాటు మరో ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు. అయితే దొరికిన వ్యక్తిపై కేసు లేకుండా చేసేందుకు పోలీసులపై రాత్రి నుంచి స్థానిక మంత్రి తీవ్ర ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

- Advertisement -
Nagari police found liquor dump midnight
Nagari police found liquor dump midnight

Also Read: Police deployed Bonda Uma angry: నేనేమి తప్పు చేశాను, తెలంగాణ పరిస్థితి వద్దని..

పుత్తూరు ప్రాంతంలోని మద్యం కేసులతో వస్తున్న ఆటో‌ను చెక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆటో‌డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. చివరకు అతడ్ని బైపాస్ రోడ్డులో పట్టుకున్నారు. ఆటోడ్రైవర్‌ని పట్టుకుని విచారించగా మద్యం డంప్ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్యా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న భవనంలో మద్యం డంప్ దాచినట్టు తేలింది. కళాశాల యజమాని సోదరి పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ కావడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News