E-Paper
Advertisement

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్
Advertisement

Delhi Airport: ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనలు ఉంటాయా? కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ నెక్ట్స్  ప్లాన్ ఏంటి? పోలీసులు రైల్వేస్టేషన్, బస్సు క్లాంపెక్సుల చుట్టూ మోహరించడం, గతరాత్రి 500 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సీజేపీ లీగల్ హెడ్ రత్నాసింగ్‌ను అదుపులోకి తీసుకుని మరొక ప్రాంతానికి తరలించారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్

ఓట్ల తొలగింపు వ్యవహారంలో సీఈసీ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపు ఇచ్చారు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే. అందుకోసం శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ఆయనను ఎయిర్‌పోర్టులో పోలీసులు నిర్బంధించారు. విమానం లోపల ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండ్ కాగానే పోలీసుల బృందం అందులోకి ప్రవేశించింది. ఢిల్లీలో ఇంటర్నెట్ ఆపడంతో దీప్కే తనను అదుపులోకి తీసుకున్న దృశ్యాలను ఇన్‌స్టా లైవ్‌లో వాటిని షేర్‌ చేశారు.

నేతలను రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు

Advertisement

అభిజీత్‌తోపాటు సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్‌, అశుతోష్ ని నిర్బంధించారు. ఆ సమయంలో పోలీసులు-అభిజీత్ సభ్యుల మధ్య మాటల ఆర్గుమెంట్ జరిగింది. జరిగిన పరిణామాలతో ఒకింత గందరగోళ పరిస్థితులు అక్కడ కనిపించాయి. విమానం దిగేవరకు ఎందుకు ఆగలేదని పోలీసులను సీజేపీ సభ్యులు ప్రశ్నించారు. మేం బయటకు వచ్చే వరకు ఉండాలని, మమ్మల్ని అరెస్టు చేయండని వ్యాఖ్యానించారు. మేం భయపడబోమని అభిజీత్ అక్కడున్న మహిళా పోలీసులతో చెప్పారు.

ఖండించిన మాజీ సీఎం కేజ్రీవాల్, ఎమర్జెన్సీ తలపిస్తోందని ఆరోపణ

అందుకుముందు అభిజీత్‌ను ఎయిర్‌పోర్టు వద్ద నిలువరించేందుకు ఐబీ, సీఐఎస్‌ఎఫ్, ఢిల్లీ పోలీసులు అక్కడ భారీగా మోహించారు. సీజేపీ లీగల్ హెడ్ రత్నా‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 మంది సిబ్బంది చుట్టు ముట్టి తనను అదుపులోకి తీసుకున్నారని రత్నా సింగ్‌ ఓ వీడియోలో వెల్లడించారు.  కీలక నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని సీజేపీ ఖండించింది. మరోవైపు బొద్దింక జనతా పార్టీ సభ్యులను నిర్బంధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

మనం మోడీ పాలించే సంపూర్ణ నియంతృత్వంలో జీవిస్తున్నామని, గాలిలోకి ఎగిరిన బొద్దింకలను నేరుగా అరెస్టు చేసి భయాన్ని చూపిస్తుందని వ్యాఖ్యానించారు. తాను ఓట్ల దొంగతనంతో ఎన్నికల్లో గెలిచానని ప్రధాని మోదీకి స్పష్టంగా తెలుసని, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచివేసి తన మోసాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెళ్ళిపోవాలి, అలాగే మోడీ కూడా అని రాసుకొచ్చారు.

ALSO READ: హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

శుక్రవారం రాత్రికి రాత్రి రాజధాని ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుండి 400 మందికి పైగానే వచ్చిన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిరసనకారుల కదలికలను అడ్డుకోవడానికి రాజధానిలో 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేశారు. శాంతిభద్రతలను కాపాడటానికి కేంద్రం బలగాలు-ఢిల్లీ పోలీసులు దాదాపు 20 వేల మందికి పైగా మోహరించారు.

 

Related News

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×