E-Paper
Advertisement

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో
Advertisement

Master Password| జీమెయిల్ ఓపెన్ చేయాలన్నా, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలన్నా, ఏదైనా యాప్‌లోకి వెళ్లాలన్నా పాస్‌వర్డ్ తప్పనిసరి. కానీ అన్ని అకౌంట్ల పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం అంత సులభం కాదు. కొందరు వాటిని పుస్తకాల్లో రాసుకుంటారు. మరికొందరు అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగిస్తారు. ఈ రెండు పద్ధతుల వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. అయితే ఒక చిన్న మార్పుతో ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. అదే పాస్‌వర్డ్ మేనేజర్. దీని ద్వారా అనేక పాస్‌వర్డ్‌లను భద్రంగా భద్రపరుచుకోవచ్చు. వాటిని యాక్సెస్ చేయడానికి ఒక మాస్టర్ పాస్‌వర్డ్ ఉపయోగించాలి.

పాస్‌వర్డ్ మేనేజర్, మాస్టర్ పాస్‌వర్డ్ అంటే ఏమిటి?

పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఒక డిజిటల్ లాకర్‌లా భావించండి. ఇందులో జీమెయిల్, సోషల్ మీడియా, షాపింగ్, బ్యాంకింగ్ వంటి అకౌంట్ల పాస్‌వర్డ్‌లను భద్రపరచుకోవచ్చు. ఈ లాకర్‌ను తెరవడానికి ఉపయోగించే కీలాంటి పాస్‌వర్డ్‌నే మాస్టర్ పాస్‌వర్డ్ అంటారు. అంటే ప్రతి అకౌంట్ పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక బలమైన మాస్టర్ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకుంటే సరిపోతుంది.

పాస్‌వర్డ్ మేనేజర్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్, బిట్‌వార్డెన్, 1Password వంటి టూల్స్ పాస్‌వర్డ్‌లను నిర్వహించడంలో సహాయపడతాయి. మీరు ఒక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినప్పుడు, సేవ్ చేసిన వివరాలను ఆటోఫిల్ ద్వారా నింపుకోవచ్చు. కొన్ని పాస్‌వర్డ్ మేనేజర్లు కొత్త అకౌంట్ల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను కూడా రూపొందిస్తాయి. వాటిని వివిధ పరికరాల్లో ఉపయోగించుకునే సౌకర్యం కూడా కొన్ని సేవల్లో ఉంటుంది. అయితే ఏదైనా టూల్‌ను ఎంచుకునే ముందు దాని భద్రతా ఫీచర్లు, రికవరీ విధానం, ధరలను పరిశీలించాలి.

మాస్టర్ పాస్‌వర్డ్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

తక్కువ పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవచ్చు: ప్రతి అకౌంట్ వివరాలను విడివిడిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవచ్చు: ప్రతి వెబ్‌సైట్‌కు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చు.
భద్రత మెరుగుపడుతుంది: ఒక అకౌంట్ పాస్‌వర్డ్ బయటపడినా, ఇతర అకౌంట్లకు అదే పాస్‌వర్డ్ ఉపయోగించకపోవడం వల్ల ప్రమాదం తగ్గుతుంది.
సమయం ఆదా అవుతుంది: ఆటోఫిల్ సౌకర్యంతో ప్రతిసారీ పాస్‌వర్డ్ టైప్ చేయాల్సిన పని తగ్గుతుంది.

Advertisement

Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సల్ బాక్స్‌లు పడేయకండి.. ఈ 3 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి

పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మాస్టర్ పాస్‌వర్డ్‌ను ఇతరులు ఊహించలేనంత బలంగా రూపొందించాలి. పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఉపయోగించకూడదు. అదే పాస్‌వర్డ్‌ను ఇతర అకౌంట్లకు వాడకూడదు. అందుబాటులో ఉంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసుకోవాలి. మాస్టర్ పాస్‌వర్డ్ మర్చిపోతే తిరిగి అకౌంట్‌ను పొందడం కష్టమవచ్చు. అందుకే ముందుగానే రికవరీ విధానాన్ని తెలుసుకోవాలి.

Also Read: EPFతో పాటు NPS కూడా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత డబుల్ బెనిఫిట్.. ఏం చేయాలంటే?

మీ ఆన్‌లైన్ అకౌంట్లను మెయిన్‌టెయిన్ చేయడం ఈజీ

పాస్‌వర్డ్ మేనేజర్ వాడటం వల్ల లాగిన్ ప్రక్రియ సులభమవుతుంది. అదే సమయంలో ప్రతి అకౌంట్‌కు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించే అలవాటు ఏర్పడుతుంది. సరైన టూల్‌ను ఎంచుకుని, భద్రతా నియమాలను పాటిస్తే మీ డిజిటల్ అకౌంట్లను మరింత జాగ్రత్తగా నిర్వహించుకోవచ్చు.

Tags

Related News

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

39 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల బయోలాజికల్ ఏజ్ సాధించిన మహిళ.. యంగ్ లుక్స్ కోసం ఏం చేసిందంటే

ఒక్కసారి ఇలా షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ చేసి చూడండి.. రుచి మామూలుగా ఉండదు!

Big Stories

Advertisement
×