Big Stories

Phase 3 Loksabha Elections: ముగిసిన మూడోదశ పోలింగ్.. 60 శాతం పోలింగ్‌ నమోదు

Phase 3 Loksabha Elections: లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడో దశ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది.

- Advertisement -

మూడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జరగగా.. ప్రశాతంగా ముగిసినట్లు ఈసీ ప్రకటించింది. మూడో విడతలో 93 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ లో కొన్నిచోట్ల చిన్నపాటి అల్లర్లు చెలరేగగా.. మిగిలిన అన్ని చోట్ల ప్రశాతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -

దేశవ్యాప్తంగా మూడోదశ పోలింగ్ 93 ఎంపీ స్థానాలకు జరగగా.. 1,300 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, వారి అదృష్టం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అస్సాంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా మహారాష్ట్రలో 53.63 శాతం పోలింగ్ నమోదైంది.

పశ్చిమబెంగాల్ లో పలుచోట్ల చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నాసరే.. రాష్ట్రవ్యాప్తంగా 73.93 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బిహార్ లో 56.01 శాతం పోలింగ్ నమోదవ్వగా మొత్తంగా దేశంలోని 11రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. 5 గంటల తర్వాత కూడా పోలింగ్ ముగిసే సమయానికి లైన్ లో ఉన్న వారికి ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని ఈసీ తెలిపింది.

Also Read: మూడోదశ లోక్ సభ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రధాని నరేంద్రమోదీ

మూడో విడతలో మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 8.93 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మూడోదశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా, అత్యధికంగా గుజరాత్ లో 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కర్ణాటకలో 14, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్ గఢ్ 7, బిహార్ 5, పశ్చిమబెంగాల్ 4, అస్సాం 4, గోవా 7, దాదగ్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ 2 స్థానాల్లో పోలింగ్ ముగిసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News