BigTV English

Road Accident : కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి

Road Accident : కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి

Krala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లో అంబులెన్స్  కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు.


కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతంలో కారును అంబులెన్స్ ఢీ కొట్టింది. కాసర్ గోడ్ నుంచి మంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో త్రిసూర్ లోని ఇరింజలకుడాకు చెందిన శివ కుమార్ అతని కుమారులు..శరత్, సౌరవ్ లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు వెల్లడించారు.

కాసర్ గోడ్ లోని మంజేశ్వర్ తాళ్లపాడు చెక్ పోస్ట్ సమీపంలో రోగితో వేగంగా వెళ్తున్న అంబులెన్స్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసారు. అనంతరం క్రేన్ సహాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.


Also Read: భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

మృతుడు శివ కుమార్ దుబాయ్ లోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×