BigTV English

Postal GDS Results 2024: పోస్టల్ GDS ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ మెరిట్ జాబితా ఇదే

Postal GDS Results 2024: పోస్టల్ GDS ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ మెరిట్ జాబితా ఇదే

Postal GDS Result 2024 : దేశ వ్యాప్తంగా పోస్టల్ శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఇండియన్ పోస్టల్ జీడీఎస్ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రతీ రాష్ట్రాల్లోని పోస్ట్ సర్కిళ్లలో ఉండే ఆఫీసుల్లో 44,228 జీడీఎస్ పోస్టులకు గాను దరఖాస్లు చేసుకున్న అభ్యర్థులకు తాజాగా పోస్టల్ శాఖ ఫలితాలు విడువల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్లో ఫలితాలను పేర్కింది. ఇందులో తెలంగాణ నుంచి 981 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 1355 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలకు సంబంధించిన వివరాలు వెబ్ సైట్లో పొందుపరిచారు.


పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. దీనిని పదవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. మరోవైపు ఎటువంటి వ్రాత పరీక్ష నిర్వహిచకుండా కేవలం పదవ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఈ జాబితాలో దేశ వ్యాప్తంగా 44,228 ఖాళీలకు గాను, ఏపీలో 1355 మంది, తెలంగాణ నుంచి 981 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.

ఎంపిక విధానంలో జరిగిన వివరాలను కూడా అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన లిస్ట్ లో కంప్యూటర్ జనరేటర్ పద్ధతిని ఉపయోగించి ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే ఇందులో మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పించారు. ఈ మేరకు ఎంపికైన వారు సెప్టెంబర్ 3వ తేదీలోగా సంబంధింత కార్యాలయాల్లో సర్టిఫికెట్లను అందజేసి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు స్థానిక గ్రామిణ డాక్ సేవ బ్రాంచ్ లలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులను అందిస్తారు.


సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కావాల్సినవి..

ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, టెన్త్ క్లాస్ మెమో, 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఆధార్, ఇన్ కం, మెడికట్ వంటి తదితర సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ మేరకు సెప్టెంబర్ 3వ తేదీన అందుబాటులో ఉండే సంబంధింత కార్యాలయాల్లో వెరిఫికేషన్ జరుగుతుంది.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×