BigTV English

PM Aerial Servey : వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ

PM Aerial Servey : వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ

Prime Minister Modi Made An Areal Survey In Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో కొండచరియలు భారీ విధ్వంసానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఉదయం 10:45 గంటలకు కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ నేరుగా చేరుకున్నారు. అనంతరం కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు చేరుకున్నారు మోదీ. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడటంతో ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాలను చేరుకొని ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధాని వెంట ఆ రాష్ట్ర సీఎంతో పాటుగా కేంద్రమంత్రి సురేశ్ గోపీ కూడా పాల్గొన్నారు.


ఏరియల్ సర్వే చేసిన అనంతరం ప్రధాని మోదీ కాల్‌పెట్ట అనే మార్గంలో దిగిపోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. ఆ తరువాత సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బందితో మోదీ ముఖ్యమైన భేటీ కానున్నారు. ఆ తరువాత వయనాడ్‌లోని పలు సహాయ శిబిరాలు, దవాఖానలను సందర్శించనున్నారు. ఆ తరువాత అధికారులతో మోదీ ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ఘటన గురించి కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ఆయనకు అధికారులు వివరంగా తెలియజేయనున్నారు. అయితే విపత్తు బాధిత ప్రాంతాల్లో పునరావాసం, సహాయక చర్యల కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ. 2 వేల కోట్లను సాయంగా కోరింది. ఈ సమయంలోనే మోదీ వయనాడ్ పర్యటనకు చేరుకున్నారు.

Also Read: మనీష్ సిసోడియా టీ తాగుతూ.. 17 నెలల తర్వాత అంటూ..


జూలై చివరి వారంలో జరిగిన ఈ ప్రకృతి విపత్తులో కనీసం 225 మంది తమ ప్రాణాలను కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. వందల మంది తీవ్రంగా గాయపడగా, గాయపడిన క్షతగాత్రులను దవాఖానకు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. అయితే విరిగిపడిన కొండచరియల కింద ఇరుక్కుపోయిన మృతుల సంఖ్య 350కి పైగా ఉండనుందని అనధికార వర్గాల అంచనా. కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేకమంది నిలువ నీడలేకుండా నిరాశ్రయులయ్యారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×