BigTV English

Priyanka Gandhi: ఆ ఆదేశాలు వెంటనే వెనక్కి తీసుకోండి: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ఆ ఆదేశాలు వెంటనే వెనక్కి తీసుకోండి: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్ల ముందు యజమానులు తమ పేర్లతో బోర్డులు ఉంచాలని ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో ఆదేశాలిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అన్నారు.


కులం, మతం ప్రాతిపదికన సమాజంలో విభజన సృష్టించడం నేరం. అది రాజ్యాంగ విరుద్ధం కూడా అని ప్రియాంక అన్నారు. మన దేశ రాజ్యాంగం కులం, మతం, భాష, ప్రాతిపదికన ఏ పౌరుడి పట్ట విపక్ష చూపించదని అన్నారు. యూపీ ప్రభుత్వం యాత్రా మార్గంలో యజమానుల పేర్లతో బోర్డులు పెట్టాలని ఆదేశించడం రాజ్యాంగంపైన దాడి చేయడమే అని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇదే వ్యవహారంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

ముస్లిం యజయాని దుకాణంలో వెళ్లే వారు ఏమీ కొనకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ ఆదేశాలను ఇచ్చిందని విమర్శించారు. యూపీ ప్రభుత్వం చర్యల్ని పలు విపక్షాలు దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్ష.. జర్మనీలో హిట్లర్ విధానాలతో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. జులై 22వ తేదీ నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.


శివరాత్రి సందర్భంగా శివ భక్తులు లేదా కవరియాస్ హర్యానాలోని కన్వర్ నుంచి హరిద్వార్ వరకు యాత్ర చేస్తారు. ఈ యాత్ర జూలై 22 న కన్వర్ లో ప్రారంభం అవనుంది. ఆగస్టు 2వ తేదీన హరిద్వార్‌లో ఈ యాత్ర ముగుస్తుంది. పలు రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈనేపథ్యంలోనే యాత్ర సాగే మార్గాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల చేయనుంది. అలాగే ఆ మార్గంలో భక్తులు తినే తినుబండారాలకు సంబంధించి యోగి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Also Read: నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి షాడో క్యాబినెట్

అందులో భాగంగానే హలాల్ ధ్రువీకరణతో ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం కన్వర్ యాత్ర సాగే ప్రాంతాల్లో హోటళ్లు, తినుబండారశాలలు, బేకరీలతో పాటు తదితర దుకాణాల వద్ద ఆయా యజమానుల పేర్లు ఖచ్చితంగా ప్రదర్శించారంటూ ఆదేశాలు జారీ చేసింది. యోగి ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచే కాదు స్వపక్షంలోని నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. యూపీలో ఈ సారి జగన్‌‌ను జరగనున్న కన్వర్ యాత్ర పెద్ద దుమారం రగిల్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×