BigTV English

Priyanka Gandhi Son: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్‌.. అబ్బురపరిచే సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌!

Priyanka Gandhi Son: ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్‌.. అబ్బురపరిచే సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌!

Priyanka Gandhis Son Raihan Vadras Third Solo Exhibition Upamana: ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా ఉండాలి. సన్నివేశం మొత్తం వివరించేలా ఉండాలి. అవి చూడగానే మనస్సులో తెలియని అనుభూతి, అనందం కలుగుతుంది. అలాంటి ఫోటోలను సోలోగా, గ్రూప్ గా ప్రదర్శించడం అనేది కూడా ఓ కళనే అవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులను ఆకట్టుకునే ధీమ్ తో పాటు వారు అటెన్షన్ పెట్టేలా సరైన క్యాచీ టైటిల్ తో పాటు ఈ వెంట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తిగా విజయవంతం అయినట్లు లెక్క. ఇలాంటి ఫోటోగ్రఫిక్ నే ప్రియాంకగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి.


రైహన్‌ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్‌ బికనీర్‌ హౌస్‌లోని లివింగ్‌ ట్రేడిషన్స్‌ సెంటర్‌ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంట్లు అనిపిస్తుంది. వాద్రా ఈ ఎగ్జిబిషన్‌ని ‘ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్‌తో నిర్వహించారు. ఆ టైటిల్‌ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం వల్ల అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు.

రైహాన్‌ సోలో ఎగ్జిబిషన్‌ ‘డార్క్‌ పర్సెప్షన్‌ యాన్‌ ఎక్స్‌పోజిషన్‌ ఆఫ్‌ లైట్‌, స్పెస్‌ అండ్‌ టైమ్‌’ పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్‌ 8 ఏళ​ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్‌ ఇన్‌స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్‌ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్‌ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌లో ఒక గది మొత్తం రాజస్తాన్‌లోని అభయ అరణ్యాల్లో క్లిక్‌ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది.


ఇతర గదుల్లో లైఫ్‌ సైజ్‌ మిర్రర్‌లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్‌లు కొన్ని ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్‌ చాలా శక్తిమంతమైన ట్రిక్‌. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమెరాతో బంధించే కళ ఇది. గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్‌ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్‌ రైహాన్‌ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి తెలియజేస్తుంది. ఇక రైహాన్‌ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్‌ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు.

Related News

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

Big Stories

×