BigTV English

Protest in Manipur: మరోసారి మణిపూర్‌లో ‘ప్రత్యేక పరిపాలన’కు డిమాండ్.. కుకీ సంఘాల నిరసన..!

Protest in Manipur: మరోసారి మణిపూర్‌లో ‘ప్రత్యేక పరిపాలన’కు డిమాండ్.. కుకీ సంఘాల నిరసన..!

Kuki Communities Protest for demanding Separate Administration in Manipur: మణిపూర్‌లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ప్రత్యేక పరిపాలన డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లాలో మెగా ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది ప్రజలు పాల్గొంటూ కుకీ సంఘం ఆందోళన చేపట్టింది. దీంతో రాష్ట్రంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్యమాన్ని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ITLF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.


రాష్ట్రంలోని కుకి జో నివాస ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు, కేంద్ర పాలిత ప్రాంతం హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ITLF మొత్తం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ సమ్మెకు పిలుపునిచ్చింది. సోమవారం పార్లమెంట్ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కావడంతో ఈ ఆందోళనలు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

లోయలోని స్థానికులు రాష్ట్ర విభజన దిశను వ్యతిరేకిస్తున్నా కూడా, కుకీ-ఆధిపత్య ప్రాంతాలు ప్రత్యేక పరిపాలన కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. కాంగ్‌పోక్పి జిల్లా, తెంగ్నౌపాల్ డైమండ్‌తో సహా ఇతర ప్రధాన కుకీ-జనావాస జిల్లాలలో ఇలాంటి పబ్లిక్ మూమెంట్‌లు, ర్యాలీలు దర్శనమిస్తున్నాయి.


Also Read: CBI arrests Delhi CM Kejriwal: లిక్కర్ కుంభకోణం కేసులో న్యూట్విస్ట్, సీబీఐ కస్టడీలో కేజ్రీవాల్‌

మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు రాజకీయ పరిష్కారం కనుగొనే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239A ప్రకారం అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. కాంగ్‌పోక్పి, తెంగ్నౌపాల్, ఫెర్జాల్ జిల్లాల్లో కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ధర్నా మరింత తీవ్రతరం చేస్తామని కుకీలు హెచ్చరిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలనీ కోరుతున్నారు.

Tags

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×