E-Paper
Advertisement

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!
Advertisement

Jio Rs 123 Plan: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే మొబైల్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ. 123 ప్లాన్. రోజుకు నామమాత్రపు డేటా అవసరం ఉన్న యూజర్లను దృష్టిలో ఉంచుకొని నెల రోజు కాల వ్యవధిలో ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ.123 ప్లాన్ కు సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రతీరోజూ 500MB డేటా

జియో రూ.123 రీఛార్జ్ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు ప్రతీరోజు 500 ఎంబీ డేటా లభించనుంది. అంటే ప్లాన్ వ్యవధి పూర్తయ్యే సరికి 14GB డేటా పొందొచ్చు. వాట్సప్ చాటింగ్, వార్తలు చదవడం, సోషల్ మీడిాయ వాడకానికి ఈ డేటా సరిపోతుందని జియో వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ప్లాన్ కింద అపరిమిత ఫ్రీ కాల్స్, రోజుకు 300 చొప్పున ఎస్ఎంఎస్ లు సైతం లభించనుంది.

ఈ ప్లాన్ వారికి మాత్రమే..

Advertisement

అయితే ఈ ప్లాన్ ‘జియోభారత్’ (JioBharat) లేదా ఫీచర్ ఫోన్లు (కీప్యాడ్ మెుబైల్స్) వినియోగిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని జియో స్పష్టం చేసింది. స్మార్ట్ ఫోన్, ఐఫోన్ ఉంటే రూ.123 ప్లాన్ వర్తించదని పేర్కొంది. కాబట్టి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునేముందు ఫోన్ ను మోడల్ ను సైతం దృష్టిలో ఉంచుకోవాలని, అర్హులు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలని తెలియజేసింది.

Also Read: స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

రీఛార్జ్ చేసుకునే ముందు జాగ్రత్త

Advertisement

తక్కువ ధరలోనే కాల్స్, డేటా లభిస్తున్నాయని పొరబడి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నేరుగా ఈ రీఛార్జ్ చేసుకోకూడదు. కాబట్టి మైజియో (MyJio) యాప్ ద్వారా లేదా అధికారిక జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ నంబర్‌‌పై లభించే ప్లాన్ల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. మెుత్తంగా కీప్యాడ్ 4జీ ఫోన్లు వాడుతూ తక్కువ ఖర్చుతో బేసిక్ ఇంటర్నెట్, కాలింగ్ అవసరాలు తీర్చుకోవాలనుకునే వారికి రూ.123 ప్లాన్ నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Tags

Related News

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!

ఒక్కసారి కొంటే 5 ఏళ్లు తిరుగుండదు.. బడ్జెట్‌లో టాప్-5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే!

బాధను కూడా నవ్వుతూ చెప్పేస్తున్న Gen Z.. సోషల్ మీడియాలో ఇదో కొత్త ట్రెండ్!

Big Stories

Advertisement
×