E-Paper
Advertisement

Chennai: రాఘవ లారెన్స్ డ్రాప్.. తిరుచ్చి నుంచి త్రిష ఖాయం?

Chennai: రాఘవ లారెన్స్ డ్రాప్.. తిరుచ్చి నుంచి త్రిష ఖాయం?
Advertisement

Chennai: తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తిరుచ్చి ఉప ఎన్నిక నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారన్న దానిపై క్లారిటీ వస్తోంది. ఈ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి బరిలోకి దిగనున్నారు. నిన్నటివరకు రేసులో ఉన్న నటుడు రాఘవ లారెన్స్ తప్పుకున్నారు. దీంతో త్రిష రంగంలోకి దిగినట్టు సమాచారం.

తమిళనాడులో తిరుచ్చి ఉప ఎన్నిక వేడి మొదలు

Advertisement

తిరుచ్చి ఉప ఎన్నిక వేళ తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించారు. ఈ క్రమంలో తిరుచ్చి సీటుకు ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వీసీకే అధినేత తిరుమావళవన్ తొలుత ఈ సీటు కోరారు. అందుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఉప ఎన్నిక రేసు నుంచి తప్పుకున్నట్లు వీసీకే అధినేత ప్రకటన చేశారు. ఈ క్రమంలో నటుడు రాఘవ లారెన్స్ పేరు వెలుగులోకి వచ్చింది.

Advertisement

రాఘవ లారెన్స్ డ్రాప్.. తిరుచ్చి నుంచి త్రిష ఖాయం?

లారెన్స్ సామాజిక సేవ చేస్తుండడంతో టీవీకే పార్టీ ఆయనకు సీటు ఇవ్వడం ఖాయమనే ప్రచారం సాగింది. దీనిపై మనసులోని మాట చెప్పేందుకు రెండు సార్లు వెనక్కి తగ్గాడు లారెన్స్. చివరకు మంగళవారం దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తిరుచ్చి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తాను పోటీ చేయబోనని తేల్చిచెప్పాడు. ఆ సీటు నుంచి తాను పోటీ చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు.

తాను పోటీ చేయడం ధర్మం కాదని అభిప్రాయపడ్డాడు. టీవీకే విజయం వెనుక కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఈ అవకాశం దక్కాలన్నాడు. తిరుచ్చి నుంచి మాత్రమే తాను తప్పుకుంటున్నానని వెల్లడించాడు. భవిష్యత్తు ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పకనే చెప్పాడు.

ALSO READ: రైతన్నలకు ఊరట.. 23 రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షాలు!

ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పకనే చెప్పాడు లారెన్స్. ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఏ పార్టీలో గౌరవం ఉంటుందో అందులోనే చేరుతానన్నాడు. క్రియాశీల రాజకీయాల్లోకి రాక ముందు కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని మనసులోని మాట బయటపెట్టాడు.

లారెన్స్ తప్పుకోవడంతో త్రిషకు ఛాన్స్ ఇచ్చే అవకాశముందనే కొత్త ప్రచారం అప్పుడు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత, సీఎం విజయ్ మనసులో ఏముంది? త్రిషకు ఛాన్స్ ఇస్తారా? లేకుంటే అక్కడి స్థానిక  నేతలను బరిలోకి దించుతారా? అనేది చూడాలి.

Related News

ఇండియన్ ఆయిల్ కంపెనీలో జాబ్స్.. రూ.1.60 లక్షల వరకు జీతం.. ఫ్రెషర్లకు మంచి అవకాశం

రూపాయికి ఇన్ని వస్తువులా? స్వాతంత్ర్యం నాటి నిత్యావసరాల ధరలు చూస్తే షాకవుతారు!

ఆగస్టు 15న కాదు.. ఆ రెండు ఆలయాల్లో 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు.. కారణం తెలిస్తే షాకే?

ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు.. జెన్ జీ నిరసనలు తప్పవంటూ, అవినీతి 90 శాతం ఇంటర్వ్యూల్లో

‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!

ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్.. విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ

Big Stories

Advertisement
×