Heart Stroke Patients : ఒక్కసారి గుండెపోటు నుండి బయటపడిన వారి శరీరంపై ఎన్నో రకాలుగా ప్రభావం పడుతుంది. వారి మానసిక పరిస్థితి దగ్గర నుండి శారీరిక ఆరోగ్యం వరకు ఎన్నో విధాలుగా మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల నుండి కోలుకొని వారు మామూలు అవ్వడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొంతమందికి ఈ గుండెపోటు అనేవి నడకపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి వారికోసమే ఓ సపోర్ట్ సిస్టమ్‌ను తయారు చేశారు శాస్త్రవేత్తలు. దాంతో వారి నడక మళ్లీ మామూలు అవుతుందని హామీ ఇస్తున్నారు.
అమెరికాలో ప్రతీ 40 సెకండ్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. అంటే ప్రతీ ఏడాది దాదాపు 795,000 మంది అక్కడ గుండెపోటుకు గురవుతున్నారని ఒక స్టడీలో తేలింది. ఇందులో గుండెపోటు నుండి బతికి బయటపడిన వారిలో దాదాపు 80 శాతం మంది నడక సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ముఖ్యంగా కాలిపై ఎక్కువగా పట్టు ఉండదు. అందుకే అలా గుండెపోటు నుండి బయటపడినవారు, లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మెల్లగా నడవడం లేదా నడవడానికి ఇబ్బంది పడడం లాంటివి ఎదుర్కుంటారు.
యాంకిల్ ఎక్సోసూట్ అనేది గుండెపోటు వచ్చినవారు నడవడానికి సాయంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోజూవారీ జీవితాల్లో వారు చేసే పనుల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తుందని అన్నారు. ఈ ఎక్సోసూట్ అనేది రోబోటిక్ టెక్నాలజీతో తయారు చేయబడుతుందని తెలిపారు. ఇది గుండెపోటు పేషెంట్ల నడక స్పీడ్‌ను, వారు రోజూవారీగా నడిచే దూరాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎక్సోసూట్‌ను మరింత మెరుగ్గా తయారు చేయడం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికైనా ఈ ఎక్సోసూట్ వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతుందన్నారు.
ఈ యాంకిట్ ఎక్సోసూట్స్ అనేవి పేషెంట్లు నడవడానికి కాలికి సపోర్ట్‌గా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఎక్సోసూట్ గురించి తెలుసుకోవడం కోసం ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రోబోటిక్‌తో పాటు మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో కూడా ఈ ఎక్సోసూట్‌ను తయారు చేయవచ్చని చెప్తున్నారు. ఇది మామూలుగా ఒక క్లాత్ లాగానే ఉంటుందని, దీనిని ధరించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఇది గుండెపోటు పేషెంట్లకు 20 నుండి 30 నిమిషాల వరకు సులువుగా నడవగలరని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.