E-Paper
Advertisement

Rahul Gandhi: అమెరికా వర్సెస్ చైనా-రష్యా.. ఇది ప్రపంచ యుద్ధానికి సంకేతమా? రాహుల్ గాంధీ ఏమ‌న్నారంటే!

Rahul Gandhi: అమెరికా వర్సెస్ చైనా-రష్యా.. ఇది ప్రపంచ యుద్ధానికి సంకేతమా? రాహుల్ గాంధీ ఏమ‌న్నారంటే!
Advertisement

Rahul Gandhi: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంతర్జాతీయ రాజకీయాలపై త‌న‌దైన శైలిలో విశ్లేషణ చేశారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదని, దీని వెనుక అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

పైకి ఇది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరాటంలా కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా ఇది అమెరికా, చైనా, రష్యాల మధ్య సాగుతున్న సంఘర్షణ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఏకైక సూపర్ పవర్‌గా తన స్థానాన్ని కాపాడుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుంటే, ఆ స్థానాన్ని సవాలు చేస్తూ చైనా వేగంగా దూసుకొస్తోందని వివరించారు. ఈ ఆధిపత్య పోరు కారణంగానే ఉక్రెయిన్, ఇరాన్ వంటి ప్రాంతాలు రణక్షేత్రాలుగా మారుతున్నాయని, ఇది చివరకు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Advertisement

మిడిల్ ఈస్ట్ ప్రపంచ చమురు ఉత్పత్తికి కేంద్ర బిందువుగా ఉందని, భారత్ తన ఇంధన అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని రాహుల్ గుర్తుచేశారు. హర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ఇంధన సరఫరా నిలిచిపోయి, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని విశ్లేషించారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చమురు సరఫరాలో ఆటంకాలు కలగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిని, భారత ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా నెమ్మదించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

మనం ఇప్పుడు అత్యంత హింసాత్మకమైన, ప్రమాదకరమైన కాలంలోకి ప్రవేశిస్తున్నామని, ఇటువంటి ఘర్షణలు భవిష్యత్తులో మరిన్ని వచ్చే అవకాశం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ తన విదేశీ విధానం పట్ల అత్యంత స్పష్టతతో ఉండాలని సూచించారు. ఒకవైపు చైనాతో సరిహద్దు వివాదాలు, మరోవైపు మిత్రదేశమైన అమెరికా యుద్ధానికి సిద్ధమవ్వడం భారత్‌కు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే మనం కూడా ఈ అగ్రరాజ్యాల గొడవలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందుల్లో పడతామని, దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ సురక్షితంగా బయటపడే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని ఆయన హితవు పలికారు.

Advertisement

Read Also: కువైట్‌లో అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై ఇరాన్ మిస్సైళ్ల దాడి

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×