E-Paper
Advertisement

మా పోరాటం ఆగదు.. మౌనం కాదు-హింసను ఆమోదించడమే- రాహుల్‌గాంధీ

మా పోరాటం ఆగదు.. మౌనం కాదు-హింసను ఆమోదించడమే- రాహుల్‌గాంధీ
Advertisement

Rahul Vs Amit Shah: సీజేపీ జంతర్ మంతర్ ఆందోళన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ విషయం ఇప్పుడు ప్రధాని మోదీ నుంచి అమిత్ షా వైపు మళ్లింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జరిగిన ఘటనకు అమిత్ షా‌ను జవాబుదారీగా నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదని తేల్చేశారు. అసలేం జరిగింది?

 

అమిత్ షా రాజీనామాకు రాహుల్‌గాంధీ డిమాండ్

Advertisement

నీట్ పరీక్ష లీక్ వ్యవహారంపై బొద్దింక జనతా పార్టీ నిరసనను పోలీసులు చేపట్టిన అణచివేత చర్యపై నోరువిప్పారు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ. ఈ క్రమంలో హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు అమిత్ షా గైర్హాజరు కావడం వెనుక మౌనం.. హింసకు ఆమోదం తెలపడమేనని తేల్చిచెప్పారు.

 

మౌనం.. హింసను ఆమోదించడమే-రాహుల్

Advertisement

విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతూ తమ భవిష్యత్తు గురించి ప్రశ్నలు అడిగారని, దానికి ప్రతిస్పందనగా వారిపై పెల్లెట్ గన్లు, మేకులు దింపిన లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారని అన్నారు. ఫలితంగా పోలీసుల చేతిలో యువతీ యువతులు గాయాలపాలయ్యారని ధ్వజమెత్తారు. చెప్పుకోలేని చోట్ల పోలీసులు కొట్టారని, మైనర్లకు ఎముకలు విరిగాయని గుర్తు చేశారు. దాదాపు 20 రోజులు గడిచినా అమిత్ షా దీనికి సమాధానం చెప్పడానికి పార్లమెంటుకు రాలేదని విమర్శించారు.

 

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు డిమాండ్-రాహుల్

చర్చ కోసం ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానాన్ని తిరస్కరించారని, ఆయన దోషి అయినా అయి ఉండాలి లేదా అసమర్థుడైనా అయి ఉండాలన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని మేం డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయంలో అమిత్ షాను జవాబుదారీగా నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

ALSO READ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురూ.. 389 జాబ్స్, వెంటనే అప్లై చేయండి?

మొదటిది అమిత్ షా విద్యార్థులపై దాడి చేయాలని పోలీసులకు అధికారం ఇచ్చారని ఆరోపించారు. అలా అయితే అతను దోషి అవుతారని తేల్చిచెప్పారు. ఇక రెండోది.. ఇంత జరుగుతున్నా ఏమాత్రం తెలియదంటే, అతను పూర్తిగా అసమర్థులని అన్నారు. ఏది ఏకమైనప్పటికీ హోం మంత్రిగా, ఆ రోజు జరిగిన ఘటనకు ఆయనే బాధ్యుడని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×