Faria Abdullah:’జాతి రత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రతో అలరించిన ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఆరడుగుల అందంతో.. అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిట్టిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈమె.. మధ్యలో కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్లు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో తిరువీర్ తో కలిసి ‘భగవంతుడు’ అనే సినిమాలో చేస్తున్న ఈమె.. మరొకవైపు కోలీవుడ్ అరంగేట్రం కూడా చేయబోతోంది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో.. వైవిద్యభరితమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న సందీప్ కిషన్ (Sandeep kishan ) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సిగ్మా. ఇందులో ఈమె హీరోయిన్గా నటిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జాసన్ సంజయ్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం వేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే తాజాగా నిర్వహించిన ఒక ఈవెంట్లో హీరో సందీప్ కిషన్ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన కామెంట్లకు ఆమె స్పందించింది. ఇటీవల సందీప్ కిషన్ ప్రెస్ మీట్ లో నా గురించి మాట్లాడుతూ.. నేను ఇప్పటికే హైదరాబాదులో కొత్త ఇల్లు కొనుక్కున్నానని, కొన్ని విషయాలు సొంతంగా కల్పించి మరీ జోడించారు. అందులో నిజం లేదు.
నేను ఇంకా సొంత ఇల్లు కొనుక్కోలేదు. కానీ సందీప్ అంత గట్టిగా చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను. అందుకే సందీప్ మాటలను నిజం చేయాలనుకుంటున్నాను. ఒక ఇల్లు కొంటే బాగుంటుందేమో అనే ఆలోచన నాలో మొదలైంది. కచ్చితంగా సందీప్ మాటలను దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాదులో ఒక ఇల్లు కొంటాను అంటూ ఆమె తనదైన శైలిలో చమత్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొత్తానికి సందీప్ కిషన్ మాటలను దృష్టిలో పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా త్వరలో ఓ ఇంటి వారు కాబోతున్నారన్నమాట అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
also read: నూతన బాధ్యతలు చేపట్టిన మెగా కోడలు ఉపాసన!
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా నిర్వహించిన ఒక ఈవెంట్లో హీరో సందీప్ కిషన్ ఫరియా అబ్దుల్లా ఎదుగుదల గురించి మాట్లాడుతూ.. “ఆమె వరుస హిట్లు అందుకోవడమే కాకుండా హైదరాబాద్లో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కొని స్థిరపడింది” అంటూ ఆమెను వెనకేసుకొచ్చి మరీ ఆమెపై ప్రశంసలు కురిపించారు . ఈ మాటలకు ఆమె నవ్వులు పూయిస్తూ అసలు విషయాన్నీ సున్నితంగా ఖండిస్తూ తన కోరిక పెట్టింది. మొత్తానికైతే వీళ్ళిద్దరూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.