Motorola G06 Power: బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో లాంచ్ అయిన ‘మోటరోలా G06 పవర్’ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాధారణంగా రూ.20,000 ఉండే ఈ ఫోన్.. ఆఫర్‌లో భాగంగా రూ.13,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.700 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అంటే దాదాపు రూ.13,299కే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఈ Motorola G06 Powerలోని ప్రధాన ఆకర్షణ దీని 7,000mAh భారీ బ్యాటరీ. రోజువారీ వాడకంలో పదే పదే ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా ఈ బ్యాటరీని డిజైన్ చేశారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు 65 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో గేమింగ్, రీల్స్, వీడియోలు ఎక్కువగా చూసే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Motorola G06 Power 6.88 ఇంచుల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గోరిల్లా గ్లాస్ 3 ఇచ్చారు. ఇక బాడీ డిజైన్ విషయానికొస్తే.. వెనుక వైపు వీగన్ లెదర్ ఫినిషింగ్ వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. సినిమా ప్రియుల కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు, రక్షణ కోసం ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు.
Also Read: ఆండ్రాయిడ్ 16, జేబీఎల్ ప్రో సౌండ్‌తో మోటరోలా కొత్త ట్యాబ్లెట్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 64GB ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. అవసరమైతే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. అలాగే ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.
సహజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుభూతి కోసం Motorola G06 Powerలో గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, మెరుగైన పెర్ఫార్మెన్స్ కోరుకునే విద్యార్థులకు, ఆఫీస్ వెళ్లేవారికి ఈ ఆఫర్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు తరచూ మారుతుంటాయి కాబట్టి కొనేముందు ధరను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
Also Read: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సరికొత్త Moto G Max.. లాంచ్ ఎప్పుడంటే?