Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికీ అవకతవకలు జరిగాయని కుండ బద్దలు కొట్టారు. దీనికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. 39 లక్షల ఓటర్లు ఎలా చేరారంటూ ప్రశ్నలు లేవనెత్తారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కొత్త ప్రశ్నలు లేవనెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. మహారాష్ట్రలో లోక్‌సభ – అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో దాదాపు 39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేశారంటూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. కొత్తగా చేరిన ఆ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? ఈ సంఖ్య హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రం మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానమన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా లేదన్నారు రాహుల్‌గాంధీ. కానీ ఎన్డీఏ కూటమి పార్టీలకు అదనంగా ఓట్లు వచ్చి చేరాయన్నారు. ఆ ఓట్లే ఎన్డీయే పార్టీలకు విజయాన్ని అందించాయని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎందుకు మార్చారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని తాను లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని రాసుకొచ్చారు. ఈ విషయంలో తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని, గణాంకాలు, డేటా ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నానని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: మాజీ సీఎం ఎడ్యూరప్పకు రిలీఫ్, బెయిల్ ఓకే.. కాకపోతే
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని గుర్తు చేశారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత. మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇదంతా ఒకెత్తయితే చాలా చోట్ల దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఆయా అంశాలపై మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Our questions to the Election Commission on the Maharashtra elections:
– Why did EC add more voters in Maharashtra in 5 months than it did in 5 years?
– Why were there more registered voters in VS 2024 than the entire adult population of Maharashtra?
– One example among many… pic.twitter.com/K7fOWdnXmV
— Rahul Gandhi (@RahulGandhi) February 7, 2025