BigTV English

Rahul Gandhi: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. ప్రధానిపై రాహుల్ సెటైర్లు

Rahul Gandhi: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. ప్రధానిపై రాహుల్ సెటైర్లు

Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ ఛైర్ సర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిండెన్ బర్గ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో సెల్లార్ సంస్థ నివేదిక స్పష్టంగా తెలుపుతుందని అన్నారు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యురిటీస్ రెగ్యులేటన్ సెబీ.. సమగ్రత, చైర్ పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో రాజీ పడిందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.


సెబీ చైర్ పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశ వ్యాప్తంగా పెట్టుబడుదారులు తెలుసుకుంటున్నారని రాహుల్ తెలిపారు. ఛైర్ పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతింది. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడుదారులు ప్రస్తుతం ప్రభుత్వాన్ని 3 ప్రశ్నలు అడుగుతున్నారు. సెబీ ఛైర్ పర్సన్ మధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు ? ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే ఎవరు వారికి జవాబుదారీగా ఉంటారు ? ప్రధాని మోదీయా ? లేక సెబీ ఛైర్ పర్సనా లేదా అదానీనా తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు మరో సారి సుమోటాగా పరిశీలిస్తుందా ? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Also Read: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి


ఇదిలా ఉంటే హిండెన్ బర్గ్ ఆరోపణలను మాధవీ పురి ఇప్పటికే ఖండించారు. ఆ సంస్థ తన వ్యక్తిత్వ  ఆరోపణలకు పాల్పడుతోందని వెల్లడించారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని అన్నారు. తాము ప్రయివేట్ వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలు కూడా అధికారులకు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణలు కుట్ర పూరితమే అంటూ కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసమే సమాచారాన్ని వక్రీకరిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×