BigTV English

Rahul Gandhi: మోదీ 2 గంటలు టైంపాస్.. ఆర్మీకి చెబితే 2 రోజుల్లో కంట్రోల్.. రాహుల్ ఆన్ ఫైర్

Rahul Gandhi: మోదీ 2 గంటలు టైంపాస్.. ఆర్మీకి చెబితే 2 రోజుల్లో కంట్రోల్.. రాహుల్ ఆన్ ఫైర్
rahul gandhi

Rahul Gandhi: అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రధాని మోదీ 2 గంటలకు పైగా వన్ మ్యాన్ షో చేశారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఎన్డీయే పాలనలో అభివృద్ధిపై ఏకరువు పెట్టారు. చివరాఖరున మణిపూర్ గురించి పైపైన మాట్లాడి ఇష్యూను మమ అనిపించారు. ప్రధాని తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో ఇంత హింస జరుగుతుంటే.. మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతుంటే.. సభలో మోదీ 2 గంటల పాటు టైంపాస్ చేశారని మండిపడ్డారు. తన ప్రసంగంలో నవ్వుతూ, జోకులు వేసుకుంటూ మాట్లాడారని.. ఈ వ్యవహారశైలి మంచిది కాదని తప్పుబట్టారు రాహుల్.


మణిపూర్‌లో అంత హింస జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోయారని కేంద్రాన్ని నేరుగా పశ్నించారు. మణిపూర్ మండుతుంటూ చూస్తూ కూర్చున్నారని.. డివైడ్ అండ్ రూల్‌లో భాగంగా.. అల్లర్లు జరిగేలా మోదీ ప్రోత్సహించారని రాహుల్ ఆరోపించారు. ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు ఇచ్చుంటే.. రెండంటే రెండే రోజుల్లో మణిపూర్ హింసాకాండను ఆపేసేదని.. కానీ మోదీ అలా చేయకపోవడానికి కారణాలు ఉన్నాయని చెప్పారు.

భారతమాతను హత్య చేశారని తాను అన్నమాట నిజమేనని.. కాకపోతే ఏ అర్థంలో అన్నాననేది చూడాలన్నారు రాహుల్. ఐడియా ఆఫ్ ఇండియాను భారతమాత అంటారని.. ఆ ఇండియా అనే భావనను మణిపూర్‌లో హత్య చేశారని.. రాష్ట్రాన్ని రెండుగా చీల్చారని రాహుల్‌గాంధీ అన్నారు.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×