BigTV English

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..
TS High Court


TS High Court : తెలంగాణలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండోసారి నివేదికను హైకోర్టుకు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేపట్టింది హైకోర్టు. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది. 500 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

రెండోసారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను హైకోర్టుకు సమర్పించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. 500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని ప్రశ్నించింది హైకోర్టు. 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.


అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని.. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 17 వాయిదా వేసింది హైకోర్టు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×