BigTV English

Budvel Auction : రైతు భూమిని వేలంలో అమ్మేసిన సర్కార్!.. బుద్వేల్‌లో కదంతొక్కిన కాంగ్రెస్..

Budvel Auction : రైతు భూమిని వేలంలో అమ్మేసిన సర్కార్!.. బుద్వేల్‌లో కదంతొక్కిన కాంగ్రెస్..
Budvel Auction


Budvel Auction : తన భూమి తనకు వదిలేయాలని మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నాడు రంగారెడ్డి జిల్లా బుద్వేల్ రైతు. సర్వేనెంబర్ 288/ 4 లోని 4.19 ఎకరాల భూమికి సంబంధించి అన్ని ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయినా హెచ్‌ఎండీఏ అధికారులు తన భూమిని వేలానికి పెట్టారని వాపోయారు.

నిరుపేద దళితులకు 1978లో అప్పటి ప్రభుత్వం భూమి ఇచ్చిందని.. అప్పటి నుంచి పాస్‌ బుక్‌లో తమ పేరే రికార్డు అవుతోందని చెబుతున్నాడు రైతు రవీందర్. ప్రభుత్వ నిబంధనల మేరకు 1978 నుండి 1994 వరకు ప్రభుత్వం సూచించిన ప్రకారం 375 రూపాయలు చెల్లించామని గుర్తు చేశాడు. అయితే ఇటీవల దీనిని అధికారులు ప్రభుత్వ భూమి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులను అడిగితే.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉందంటూ తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.


ప్రభుత్వ భూముల వేలం పాటపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. బుద్వేల్ లో అమ్మకం పూర్తైన భూములను చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కిసాన్ సెల్ నాయకులు కోదండరెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్దసంఖ్యలో బుద్వేల్ కు వెళ్లారు. అయితే వీరిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కిసాన్ కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్విదం జరిగింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×