Big Stories

Rahul Gandhi: రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఎన్నికలివే: రాహుల్ గాంధీ

Rahul Gandhi: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు అండగా నిలవాలని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఓటర్లకు విజ్ఞ‌ప్తి చేశారు.రెండో దశ పోలింగ్ సందర్భంగా ఎక్స్ వేదికగా రాహుల్ ఓ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో లోక్‌స‌భ ఎన్నిక‌లు దేశ రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యాన్ని రక్షించేందుకు జ‌రిగే ఎన్నిక‌ల‌ని రాహుల్ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ప్రజాస్వామ్యం ప‌ట్ల తమ బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -

బీజేపీ, ఆరెస్సెస్ లు రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటుప‌డుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా స‌మ‌స్య‌లు తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు మేనిఫెస్టో తయారు చేసిందని తెలిపారు. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ పాద‌యాత్ర చేశానని రాహుల్ గుర్తుచేశారు.

- Advertisement -

Also Read:రేపే రెండో దశ ఎన్నికల పోలింగ్‌.. ఓటర్లకు ఐఎండీ కీలక హెచ్చరికలు..!

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం ఐదు గ్యారంటీల‌ను పొందుప‌రిచామ‌ని తెలిపారు. మోదీ దేశానికి మిలియ‌నీర్ల‌ను తయారు చేసి ఇస్తే తాము కోట్లాది మ‌హిళ‌లు, యువ‌త‌ను ల‌క్షాదికారులుగా మారుస్తామని అన్నారు. అంతే కాకుండా రైతులు పండించిన పంటలకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ చేస్తామ‌ని వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆద‌రించి పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని వీడియో సందేశం ద్వారా రాహుల్ ఓటర్లను కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News