BigTV English
Advertisement

Chandrababu Comments: ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? : చంద్రబాబు

Chandrababu Comments: ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? : చంద్రబాబు

Chandrababu Comments on YS Jagan(Andhra politics news): ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ప్రజాగళం సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచేశారని అన్నారు. జగన్ ఐదేళ్లు పరదాల చాటున తిరిగారని, ఆయనను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇగ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు దగ్గరకు వెళ్లి ఓటు అడుగుతావంటూ ప్రశ్నించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని, జగన్ పాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంటా అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.


అదేవిధంగా రాజంపేటలో కూడా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని, జగన్ ఇంటికి పోవడం తప్పదని చంద్రబాబు అన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అప్పటివరకు నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామన్నారు.

Also Read:వైసీపీని తొక్కేద్దాం.. కూటమిని తెచ్చేద్దాం: పవన్ కళ్యాణ్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల్లోనే ఉందని, ఆ పరిస్థితి మారాలంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ఓడిపోతాడని ముందే పసిగట్టి 70 స్థానాల్లో అభ్యర్థులను మార్చారని పవన్ అన్నారు. వైసీపీని తొక్కేద్దాం.. కూటమి పాలన తెచ్చేద్దామంటూ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Related News

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Big Stories

×