E-Paper
Advertisement

Rahul Gandhi : ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవమే మొదటి ప్రాధాన్యత.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

Rahul Gandhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మ గౌరవం తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వినేశ్ ఫోగాట్ తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు శనివారం బయలుదేరిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. యావత్‌ దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి కూతురికీ ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం అన్నారు. ఆ తర్వాతే ఏదైనా అవార్డు అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

అంతకు ముందు తనకు వచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న వినేశ్‌ ఫొగాట్‌.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు శనివారం వెళ్లింది. ఆ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వాటిని కర్తవ్యపథ్‌ వద్ద వదిలేసింది. అనంతరం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వదులుకుంటానని వినేశ్‌ ఇంతకు ముందే ప్రకటించింది.

ఇదిలా వుండగా డబ్ల్యూఎఫ్‌ఐని క్రీడా మంత్రిత్వ శాఖ ఇది వరకే సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. సమాఖ్యను నడిపించడానికి తాత్కాలిక కమిటీని అంతర్జాతీయ ఒలంపిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×