Rahul Gandhi Missing India Bloc Rally due Unwell: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత జైరాం రమేష్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం వల్ల ఈరోజు జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని ఆయన తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని సాత్నాలో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి, జార్ఖండ్ లోని రాంచీలో జరగబోయే ఇండియా కూటమి మెగా ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడం వల్ల.. ప్రస్తుతం ఢిల్లీని వదిలి రాలేని పరిస్థితి నెలకొన్నట్లు పార్టీ సీనియర్ నేత జైరాం రమేష ట్వీట్ చేశారు. అయితే రాహుల్ గాంధీకి ఫుడ్ పాయిజిన్ అయినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
Also Read: Padma Awards 2024 : పద్మ అవార్డుల ప్రదానం.. పద్మవిభూషణ్ అందుకోనున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి
రాహుల్ గాంధీ పాల్గొనబోయే ఈ రెండు సమావేశాల్లో ఆయన స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే పాల్గొంటారని తెలిపారు. కాగా, రాంచీలో జరిగే ‘ఉల్గులన్ న్యాయ్’ ర్యాలీకి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ యాదవ్‌తో సహా భారత కూటమికి చెందిన పలువురు నాయకులు హాజరుకానున్నారు.
श्री राहुल गांधी आज सतना और रांची में चुनाव प्रचार के लिए पूरी तरह से तैयार थे, जहां INDIA की रैली हो रही है। लेकिन वह अचानक बीमार हो गए हैं और फिलहाल नई दिल्ली से बाहर नहीं जा सकते हैं। कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे जी अवश्य सतना में जनसभा को संबोधित करने के बाद रांची…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 21, 2024