BigTV English
Advertisement

Masked Aadhaar Card: ఆధార్ అలర్ట్.. స్కాముల నుంచి ఇలా బయటపడండి..!

Masked Aadhaar Card: ఆధార్ అలర్ట్.. స్కాముల నుంచి ఇలా బయటపడండి..!

Masked Aadhaar Card: ఆధార్.. దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ప్రభుత్వ పథకాల నుంచి అనేక సేవలు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో బస్సులో ప్రయాణించాలన్ని ఆధార్ చూపించాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో మనకు అవసరమైన ప్రతిచోటా ఆధార్ ఫోటో కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల మన వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దేశంలో ఆధార్ స్కామ్‌లు కూడా పెరిగిపోతున్నాయి.


ఈ క్రమంలో ప్రభుత్వం ఆధార్ నెంబర్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నెంబర్ మన బ్యాంక్ అకౌంట్‌లను, ఇతర ముఖ్యమైన వాటికి లింక్ అయి ఉంటుంది. ఆధార్ నెంబర్‌ను అవసరం మేరకే షేర్ చేయాలని సూచిస్తోంది. ఫ్రాడ్ లేదా స్కామ్‌ల బారిన పడుకుండా మాస్క్‌డ్ ఆధార్ కార్డులను ఉపయోగించాలని చెబుతుంది. మనలో చాలా మందికి మాస్క్‌డ్ ఆధార్ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. దాని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకోండి.

Also Read: సరికొత్త వెర్షన్‌లో హోండా యాక్టివా.. లాంచ్ ఎప్పుడంటే?


మాస్క్‌డ్ ఆధార్ అంటే అన్నీ నంబర్లు కనిపించకుండా ఉండటమే. యూఐడీఏఐ జారీ చేసిన ఆధార్‌లో సాధారణంగా 12  నంబర్లు ఉంటాయి. అయితే మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే 8 నంబర్లు X అని మాస్క్ అవుతాయి. అంటే చివరి 4 నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. యూజర్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఆధార్ కార్డును ఇలా చేయడం వల్ల స్కామ్‌లు చాలా వరకు తగ్గుతాయి. UIDAI ప్రజలను ప్రమాదం నుండి సురక్షితంగా ఉంచడానికి మాత్రమే జారీ చేస్తుంది. రైలులో ప్రయాణించేటప్పుడు, విమానాశ్రయం, హోటల్‌ను బుక్ చేసుకోవడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.

మాస్క్‌డ్ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మీరు కొన్ని దశలను అనుసరించాలి. వాస్తవానికి దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి సాధారణ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసే ప్రక్రియనే అనుసరించాలి.ఈ దశలను అనుసరించండి

  1.  ముందుగా మీరు UIDAI అధికారిక సైట్ https://uidai.gov.in/కి వెళ్లాలి.

2. దీని తర్వాత డౌన్‌లోడ్ ఆధార్ విభాగం కింద ఉన్న ‘మై ఆధార్’ ఎంపికపై నొక్కండి.

3. ఇప్పుడు ట్రాన్సాక్షన్ నంబర్, క్యాప్చా నింపి, సెండ్ OTPపై క్లిక్ చేయండి.

4. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వెళుతుంది. దాన్ని ద్వారా ధృవీకరించండి.

5. ఇప్పుడు డౌన్‌లోడ్ ఆప్షన్ మీ ముందు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

6. డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ ముందు చెక్‌బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మీకు మాస్క్‌డ్ ఆధార్ కావాలా అని అడుగుతుంది. ఆపై మీరు దానిపై టిక్ చేయాలి.

7. దీని తర్వాత మాస్క్ వేసిన ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

Also Read: బైక్‌‌పై రూ.లక్షల్లో డిస్కౌంట్.. రేపే లాస్ట్

డౌన్‌లోడ్ చేయబడే మాస్క్ ఆధార్  PDF లాక్ చేయబడుతుంది. దాన్ని ఓపెన్ చేయడానికి మీరు మీ పేరులోని నాలుగు లెటర్స్‌ను క్యాపిటన్ లెటర‌్స్‌తో నింపాలి. మీ పేరు వంశీ అయితే మొదట నాలుగు VAMS ఆపై DOBని YYYY ఫార్మాట్‌లో నమోదు చేయాలి. ఉదాహరణకు మీ పుట్టిన తేదీ 1996 అయితే, అతని పాస్‌వర్డ్ VAMS1996 అవుతుంది.

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×