BigTV English

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర 2.0.. ర్యూట్ మ్యాప్ ఇలా..!

Rahul Gandhi : భారత్ జోడో యాత్ర 2.0..  ర్యూట్ మ్యాప్ ఇలా..!

Rahul Gandhi : రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. గుజరాత్ లోని పోర్ బందర్ వరకు ఈ యాత్ర సాగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్లు యాత్ర సాగేలా ర్యూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు.


రాహుల్ గాంధీ తొలి విడతలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు. మొత్తం 4,400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తమిళనాడు, కర్నాటక, ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల గుండా ముందుకు సాగుతూ కాశ్మీర్ లో పాదయాత్రను ముగించారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా ఎంతో స్పందన లభించింది. సామన్యుల కష్టాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు.

తన వస్త్రధారణ, అలవాట్లపై బీజేపీ నేతలు విమర్శలు చేసినా, హేళనా చేసినా వారికి సరైన సమయంలో కౌంటర్లు ఇస్తూ రాహుల్ ఎంతో రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మొత్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో 1.0 సూపర్ సక్సెస్ అయ్యింది.


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0పై పార్టీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ కీలక ప్రకటన చేశారు. తూర్పు- పడమర ప్రాంతాల మధ్య మరో యాత్ర చేపట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని తెలిపారు. రాహుల్ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో కొత్త శక్తి, ఉత్సాహం వచ్చాయన్నారు. ఈ సారి చేపట్టబోయే యాత్ర కాస్త భిన్నంగా ఉంటుందని జైరాం రమేశ్‌ అన్నారు. దట్టమైన అడవులు, నదులు ఉండటం వల్ల కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా ‘మల్టీ మోడల్‌ యాత్ర’గా కార్యక్రమాన్ని రూపొందించే అవకాశముందని చెప్పారు. జూన్‌ ముందుగానీ, నవంబర్ తర్వాత గానీ యాత్ర చేపట్టే అవకాశముందని జైరాం రమేశ్ అన్నారు. కొన్ని రోజుల్లోనే భారత్ జోడో యాత్ర 2.0 పై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సిసోడియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×