BigTV English
Advertisement

Pat Cummins Meets Virat Kohli: నీ అంత మంచోడు లేడు.. కమిన్స్ తో అన్న విరాట్

Pat Cummins Meets Virat Kohli: నీ అంత మంచోడు లేడు.. కమిన్స్ తో అన్న విరాట్
You Are Too Good Pat Virat Kohli’s Heart-Warming Interaction Ahead of SRH vs RCB:

ఐపీఎల్ లో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. అయితే రెండు జట్లు ఉదయం మ్యాచ్ ప్రాక్టీస్ చేశాయి. ప్రాక్టీస్ అనంతరం అలసిపోయిన కొహ్లీ ఒక దగ్గర కూలబడ్డాడు.


ఈ సమయంలో రెండు జట్ల కోచ్ లు అక్కడ పిచ్ మీద తిరుగుతున్నారు. ఈ సమయంలో  ఆర్సీబీ కోచ్ తో అంతకుముందే కొహ్లీ మాట్లాడిన మాటలను బహుశా కమిన్స్ దూరంగా ఉండి విన్నట్టున్నాడు.

అటువైపుగా వెళుతూ కొహ్లీని చూసి, వికెట్ చాలా ఫ్లాట్ గా కనిపిస్తోంది. అన్న మీ మాటలు, నేను కూడా విన్నాను అని సరదాగా వ్యాక్యానించాడు.


దీంతో కొహ్లీ, మీ అంత మంచోడు లేరు కమిన్స్ అని బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ సరదాగా నవ్వుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వీరి సంభాషణ చూసిన తోటి ఆటగాళ్లు కూడా వీరితో జతకలిశారు. అందరూ కాసేపు సరదాగా నవ్వుకున్నారు.

Also Read: కలలో కూడా అవే.. ఐపీఎల్‌ హిస్టరీలో మోహిత్ రికార్డ్

నిజానికి మ్యాచ్ ముందు ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, సహాయకులు అందరూ పిచ్ ని గమనిస్తారు. దాని స్వభావం ఎలా ఉంది? అనేది తెలుసుకుంటారు. వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, అది బ్యాటింగ్ కి అనుకూలమా ? బౌలింగుకి అనుకూలమా? లేకపోతే సెకండాఫ్ బ్యాటింగ్ చేసేవాళ్లకి అనుకూలమా? ఇలా ఎన్నో అంశాలపై వాళ్లు మ్యాచ్ కి ముందు అవగాహనకి వస్తారు. అయితే అంతకుముందే పిచ్ రిపోర్ట్ ను క్యూరేటర్ రెండు జట్లకి అందిస్తాడు.

ఇదంతా మ్యాచ్ లో ఒక భాగంగా జరుగుతుంది. పిచ్ ఫ్లాట్ గా ఉందనేది, ప్రతీ క్రికెటర్ కి చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. జనరల్ గా అదే మాటను కొహ్లీ క్యాజువల్ గా కోచ్ తో అని ఉంటాడు. ఆ పక్కనే ఉన్న కమిన్స్ అదే మాటను కొహ్లీని ఆటపట్టిస్తూ అన్నాడన్నమాట. పిచ్ ప్లాట్ గా ఉందని మీరన్న మాటలు రహస్యంగా నేను విన్నాను అనే అర్థం వచ్చేలా చెప్పాడు.

దానికి కొహ్లీ నువ్వు చాలా మంచివాడివి, నాకు మాత్రమే చెప్పావు అనే అర్థం వచ్చేలా కొహ్లీ అనడంతో అక్కడ నవ్వులు పువ్వులై విరిశాయి. మొత్తానికి ఆటలో ప్రత్యర్థులుగా ఉన్నా బయటమాత్రం క్రికెటర్లందరూ కలిసి మెలిసి ఉంటారనడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags

Related News

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Big Stories

×