Big Stories

Alluri Sitaramaraju: కోతుల కోసం ఉచ్చు.. ట్రాప్ లో పడి చిరుత మృతి

Alluri Sitaramaraju : ఎరక్కపోయి ఇరుక్కుపోయిందో చిరుత. ఉచ్చులో చిక్కింది. పంట పొలాలను కోతులు నాశనం చేస్తుండటంతో వాటిని తట్టుకోలేక ఏర్పాటు చేసిన ట్రాప్‌లో పడింది. విలవిల్లాడిన చిరుతపులి చివరకు ప్రాణాలు కోల్పోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల సమీపంలో జరిగిందీ ఘటన.

- Advertisement -

ఎల్లవరం-రేగులపాడు మధ్య పొలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. గుర్తుతెలియని వ్యక్తులు కోతుల కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి పొలాల్లోకి ప్రవేశించిన చిరుత ఆ ఉచ్చులో చిక్కుకుంది. తీగ దాని నడుముకు బిగిసుకుపోయింది. దాన్నుంచి బయటపడేందుకు అది ప్రయత్నించగా.. చెట్టుపై ఉన్న ఓ వలలో చిక్కుకుంది. దీంతో కిందకు వేలాడిపోయింది. కొన్ని గంటల పాటు ఉండిపోయింది. గురువారం ఉదయం పొలానికి వెళ్తుండగా.. ఓ రైతు పులి చిరుతను చూశాడు. స్థానికులకు విషయం చెప్పడంతో అటవీశాఖకు సమాచారం వెళ్లింది. అప్పటికి అది బతికే ఉంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేంద్రన్‌ ఆధ్వర్యంలో దాన్ని ట్రాప్ నుంచి, వల నుంచి బయటకు తీశారు. నీరు తాగించారు. విశాఖపట్నం జూ పార్క్‌ నుంచి రెస్క్యూ టీం వచ్చి చిరుతను బోనులోకి ఎక్కించారు. కొద్దిసేపటికే అది చనిపోయింది.

- Advertisement -

చిరుతకు నడుము ఉచ్చు బిగుసుకోవడంతో.. కింద భాగానికి రక్త సరఫరా ఆగిపోయిందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. చిరుతకు కిడ్నీలు ఫెయిల్‌ అయిపోయినట్టు పంచనామాలో గుర్తించారు. మరోవైపు విశాఖ జూ పార్క్ నుంచి రెస్క్యూ టీం ఆలస్యంగా రావడం వల్లే చిరుత మృతి చెందిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి చిరుతపులి ఉచ్చులో చిక్కుకుంటే.. గురువారం ఉదయానికి అటవీ అధికారులు వచ్చినా.. సాయంత్రం 3న్నర గంటల వరకు రెస్క్యూ టీం రాలేదని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఈ ఆలస్యం వల్లే చిరుత ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని అంటున్నారు. రెస్క్యూ టీం వచ్చేటప్పటికి చిరుత ప్రాణాలతో ఉండేదని.. ముందుగా వచ్చి ఉంటే బతికే అవకాశం ఉండేదని స్థానికులు చెప్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News