పాకిస్తాన్ కుటిల బుద్ధి, వారికి వంత పాడే చైనా దుష్టబుద్ధి.. ఈ ఇద్దరి కుతంత్రాన్ని అంతర్జాతీయ వేదికపైనే తిప్పికొట్టారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. షాంఘై సహకార సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన.. భారత్ కి మచ్చ తెచ్చేలా తయారు చేసిన జాయింట్ డాక్యుమెంట్ ని తిరస్కరించారు. దానిపై సంతకం పెట్టేందుకు నిరాకరించారు. దీంతో చైనా సహా, ఆ సమావేశానికి హాజరైన ఇతర దేశాల ప్రతినిధులు షాకయ్యారు. జాయింట్ డాక్యుమెంట్ తయారీ వివాదాస్పదంగా మారింది.
పహల్గామ్ ప్రస్తావన లేకుండా SCO పత్రం.. సంతకం చేయని రాజ్నాథ్ సింగ్
ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై కీలక ప్రసంగం.
సమావేశం అనంతరం జాయింట్ డాక్యుమెంట్లో పహల్గామ్ ప్రస్తావన… pic.twitter.com/SCSpFvi8ZY
— ChotaNews App (@ChotaNewsApp) June 26, 2025
అసలేం జరిగింది..?
చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ ఓ సదస్సు నిర్వహించింది. దీంట్లో సభ్య దేశాల రక్షణ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భారత్, చైనా, పాకిస్తాన్ సహా మొత్తం 10 సభ్య దేశాల మంత్రులు పాల్గొన్నారు. ఇందులో పహల్గాం దాడి, తదనంతర పరిస్థితుల్ని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. సీమాంతర ఉగ్రవాదం గురించి కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఎలా ఎదుర్కొందో చెప్పారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతిస్తున్నాయని, ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని కూడా వివరించారు. శాంతి కాముక దేశాలు ఉగ్రవాదానికి దూరంగా ఉండాలన్నారు. శాంతి, శ్రేయస్సు అనేవి ఉగ్రవాదంతో కలసి ఉండలేవన్నారు. కొన్ని దేశాలు ద్వంద్వ వైఖరిని పాటిస్తున్న తీరుని ఆయన అంతర్జాతీయ వేదికపై ఎండగట్టారు.
సంతకం చేయను..
సదస్సు అనంతరం దాని సారాంశాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేశారు నిర్వాహకులు. ఈ సంయుక్త ప్రకటనలో రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించిన అంశాలకు చోటు లేకపోవడం విశేషం. అదే సమయంలో బలూచిస్తాన్ వేర్పాటు వాదం గురించి మాత్రం అందులో ఉంది. ఆ విషయాన్ని పాకిస్తాన్ ప్రస్తావించగా, యథాతథంగా జాయింట్ డూక్యుమెంట్ లో పొందుపరిచారు. ఇక్కడ నిర్వాహకుల ద్వంద్వ వైఖరి స్పష్టమైంది. ఈ జాయింట్ డాక్యుమెంట్ ని చదివి వినిపించిన తర్వాత సభ్య దేశాల రక్షణ మంత్రుల సంతకాలను కోరారు. అయితే రాజ్ నాథ్ సింగ్ ఆ డాక్యుమెంట్ ని తిరస్కరించారు. భారత్ పై జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించకుండా, సీమాంతర ఉగ్రవాదం గురించిన అంశాలు లేకుండా డాక్యుమెంట్ రూపొందించడంపై ఆయన మండిపడ్డారు. ఇక్కడ కూడా ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం సరికాదంటూ నిర్వాహకులకు హితవు పలికారు. దీంతో సంయుక్త ప్రకటనను షాంఘై సహకార సంస్థ రద్దు చేసింది.
సంతకం చేసేది లేదంటూ రాజ్ నాథ్ సింగ్ చెప్పడంతో చైనా షాకైంది. సంతకం చేయకుండా రాజ్ నాథ్ సింగ్ ఒకేసారి అటు చైనాకు, ఇటు పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పారని అంటున్నారు. ఈ సదస్సులో భారత వైఖరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చైనా, పాక్ కి ఇటువంటి గుణపాఠం చెప్పాల్సిందేనంటున్నారు. అంతర్జాతీ వేదికపై వారి చర్యలను ఖండించడం సరైన చర్య అంటూ రాజ్ నాథ్ సింగ్ కి మద్దతుగా నిలిచారు. భారత్ కు మద్దతుగా నెటిజన్లు సోషల్ మీడియాలో సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.