BigTV English

Khammam DCC President: ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే?

Khammam DCC President: ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే?

Khammam DCC President: ఆ జిల్లా డీసీసీ పీఠంకోసం పలువురు ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తున్నారట. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న నాయకుడు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కావాలని పట్టుపడుతున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇక ఓ మంత్రి అనుచరులు ఇద్దరు తమకు డీసీసీ పదవి ఇప్పించాలని ఆయన్ను కోరుతున్నారట. మరో పక్క మాజీ కేంద్ర మంత్రి,రాజ్యసభ సభ్యురాలు కూడా తమ వర్గం వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇంతలా ఆ పదవి కోసం పోటీపడుతున్న జిల్లా ఏది? ఎవరా నేతలు?


కాంగ్రెస్‌కు కంచుకోటగా ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా… కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి గట్టిపట్టున్న ప్రాంతమని కాంగ్రెస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అంతకు ముందు కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మం జిల్లాకు నిలిచింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పాటు అధికారంలో ఉన్నా… ఇక్కడ ప్రతి సారీ ఒక్క ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకుంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నా, పార్టీ క్యాడర్ పెద్దగా చెక్కు చెదరలేదనే చర్చ ఉంది. అందుకే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాల్లో ఐదుకు ఐదు.. భారీ మెజారిటీతో గెలుపొందడం వెనక పార్టీ నేతలు, కార్యకర్తల కృషి అమోఘమని చెప్పవచ్చు.


పార్టీ క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గడిచిన పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీకీ అధికారం లేక అచేతనంలో ఉన్న కాలంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ క్యాడర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమించారు. ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ సైతం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు డీసీసీ పదవి సమర్థవంతంగా చేపట్టి గ్రామాల్లో కిందిస్తాయి కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడంలో సఫలమయ్యారు. నిత్యం భట్టి సూచనలతో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పార్టీ కార్యాలయం వేదికగా ఆనాటి ప్రభుత్య పనితీరును ఎండగట్టేవారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఆర్థికంగాను, మానసికంగాను ఇబ్బందులకు గురిచేసినా.. వాటన్నింటిని తట్టుకొని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కింది స్థాయి కేడర్‌ను పటిష్టం చేసే ఉండేవారు. భట్టి సూచనలతో జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ వ్యూహాలు ఫలించాయట.. ఫలితంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందంటారు.

రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి, లేదా ఖమ్మం సూడా ఛైర్మన్ పదవిలో ఎదో ఒకటి ఇవ్వాలని భట్టి విక్రమార్కను గట్టిగానే కోరుతున్నారట ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ రెండు పదవులు ఇచ్చే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం భట్టి పువ్వాళ్ళను సముదాస్తూ వస్తున్నారని టాక్. ఇటీవల ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాల్లో పార్టీ అధ్యక్షులే కిరోల్ అని చెప్పడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు గా ఉన్న దుర్గాప్రసాద్ నే కొనసాగాలని కోరుతున్నారట.

సముచిత స్థానం ఇప్పించాలని కోరుతున్న పొంగులేటి ఇద్దరు అనుచరులు

ఇక ఇదిలా ఉంటే జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఇద్దరు తమకు సముచిత స్థానం ఉండె పోస్టు ఇప్పించాలని కోరుతున్నారట. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను డిమాండ్‌ చేస్తున్నారట. వారిలో ఒకరు వైరా నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజికవర్గ నేత, మరొకరు ఎస్సీ కేటగిరికి చెందిన వ్యక్తిగా ఉన్నారని సమాచారం. వీరిద్దరూ మంత్రి పొంగులేటికి ప్రధాన అనుచరులు కావడం విశేషం. ఆ ఇద్దరు నేతలు జిల్లాలో బలమైన నేతలుగా ముద్ర పడినవారే కావటంతో.. వారు కూడా జిల్లా డీసీసీ పదవి ఇప్పించాలని మంత్రిని కోరుతున్నారట.

తన అనుచరులకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు రేణుక చౌదరి వ్యూహాలు

వీరే కాక ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే ఫైర్ బ్రాండ్, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి కూడా తన అనుచరులకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారట. పాలేరు నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీగా గెలిచి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న… జడ్పీటిసి రాష్ట్ర సంఘం మాజీ అధ్యకులు కూడా తనకు సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నారట. అంతేకాదు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూడా తనకు పార్టీలో సముచిత స్థానం కావాలని పార్టీ పెద్దలను కోరుతున్నారట వీరికి గ్రామీణ ప్రాంతాల్లో, మండలాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహనతో పాటు కార్యకర్తలతో మంచి ఫాలోయింగ్ ఉందనే చర్చ ఉంది. అంతేకాదు గత పాలకుల పనితీరును ఎండగట్టే సందర్భాలలో గలమెత్తి నినదించారనే టాక్ లేకపోలేదు. అందుకే డీసీసీ పదవి ఇవ్వాలని ఆశిస్తున్నారు ఈ నేతలు.

Also Read: కిమిడి నాగార్జున, మజ్జి శ్రీనావాసరావుల పోస్ ఊస్ట్?

ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠంపై భారీగానే నేతల ఆశలు

ఇలా పలువురు నేతలు ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠంపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. తమకు మంత్రులతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించకోని ఖమ్మం జిల్లా పార్టీ, అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా ఎవరి ఆశలు వారికి ఉన్నాయి. తమ అనుచరులకే పగ్గాలు ఇప్పించాలని అటు మంత్రులు, పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మరి పార్టీ అధిష్టానం ఎవరిని డిసిసి అధ్యక్షునిగా ఎంపిక చేస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అదే సమయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంతో ఎవరి మనసు నొచ్చుకొకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Story By Vamshi Krishna, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×